ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​లో తెలుగు కుర్రాడి హవా! - సూర్యకుమార్‌ను వెనక్కినెట్టి 69 స్థానాలు ఎగబాకిన తిలక్ వర్మ! - ICC T20 RANKINGS

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తెలుగోడి మేనియా - 69 స్థానాలు ఎగబాకి టాప్​ 10 చేరుకున్న తిలక్ వర్మ!

ICC T20 Rankings
Tilak Varma (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 20, 2024, 5:15 PM IST

ICC T20 Rankings : టీమ్‌ఇండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడికంటే ముందంజలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్​ను వెనక్కి నెట్టి మరీ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఈ లిస్ట్​లో ట్రావిస్‌ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా తొలి రెండు స్థానాలను సొంతం చేసుకున్నారు.

అయితే తిలక్ వర్మ తన టీ20 కెరీర్‌లో ఇలా టాప్‌-10లో నిలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ యంగ్ ప్లేయర్ అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ బాది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా రికార్డుకెక్కాడు. సఫారీలతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్‌ 198 స్ట్రైక్‌రేట్‌తో 280 పరుగులు స్కోర్​ చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 20 సిక్సర్లు బాదాడు.

మరోవైపు ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఈ ర్యాంకింగ్స్​లో 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అతడు తన ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా మూడు శతకాలను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో అలాగే రుతురాజ్‌ గైక్వాడ్ 15వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఆల్‌రౌండర్ల విభాగంలో స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య రెండు స్థానాలు మెరుగుపరుచుకుని తిరిగి అగ్రస్థానాన్ని సాధించాడు. అక్షర్ పటేల్ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌పై మూడో టీ20లో 17 బంతుల్లోనే 54 పరుగులు స్కోర్ చేసిన సౌతాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్‌ 65 స్థానాలు ఎగబాకి 14వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే టీమ్ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ 10 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరచుకుని టాప్‌-10లోకి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం 9వ స్థానంలో ఉండగా, రవి బిష్ణోయ్‌ మాత్రం ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.

బౌలింగ్, బ్యాటింగ్​లో పాక్ ప్లేయర్లదే హవా - సూర్య డౌన్​, కోహ్లీ, రోహిత్ స్థానం ఎంతంటే?

భారత్ లేకుండా ICC టోర్నీయే లేదు- రికార్డులు చూస్తే ఔను అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.