ETV Bharat / state

కేంద్ర బడ్జెట్​లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.31 వేల కోట్లు - హైదరాబాద్ మెట్రోకు మాత్రం 'సున్నా' కేటాయింపు - METRO DEVELOPMENT IN HYDERABAD

మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్​లో రూ. 31వేల కోట్లు కేటాయింపు - తెలంగాణకు మాత్రం మంజూరు కాని నిధులు

UNION BUDGET 2025
Metro Development In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 8:50 AM IST

Metro Phase-2 Development in Hyderabad : దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులను పరుగు తీయించడమే లక్ష్యంగా బడ్జెట్​లో రూ. 31వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. అందులో తెలంగాణకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. హైదరాబాద్​లో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని ఆశ్రయించి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయినప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఎక్కడా తెలంగాణ గురించి ప్రత్యేక ప్రస్తావన రాలేదు.

మెట్రో రెండో దశకు కేంద్రం బడ్జెట్ : ఈ క్రమంలో రూ.24వేల కోట్ల అంచనా వ్యయంతో ఐదు మార్గాల్లో అభివృద్ధి చేయదలచిన మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు దక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సర్కారు సహాయం అందిస్తేనే ఆయా ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు తెలుపుతున్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్- హయత్ నగర్​కు, ఎల్బీనగర్ నుంచి శివరాంపల్లి మీదుగా విమానశ్రయానికి, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్టకు, మియాపూర్ నుంచి పటాన్​చెరు వరుకు మెట్రోను విస్తరించాలన్నది రెండో దశ ప్రాజెక్టు ఉద్దేశం.

ఒక్క రూపాయి కూడా దక్కలేదు : హైదరాబాద్​ రూపురేఖలను మార్చేసే మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ వినతులను కేంద్రం పట్టించుకోవట్లేదు. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుకు పద్దులో ఒక్క రూపాయి కూడా దక్కలేదు.

మెట్రో విస్తరణపై సమీక్ష - అప్పుడే టెండర్లు పిలవాలని నిర్ణయం

జేబీఎస్ వద్ద​ మెట్రో హబ్ ఏర్పాటు - సుదీర్ఘ కారిడార్‌కు అధికారుల ప్రణాళికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.