Cyber Fraud in Hyderabad : ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేసిన క్షణంలోనే తన ఖాతాలోంచి రూ.4 కోట్ల 70 లక్షలు మాయమయ్యాయంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి(67) ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్డ్ నుంచి ఓ పార్శిల్ వచ్చింది. డెలివరీ చేసేందుకు కొరియర్ బాయ్ రోడ్డుపై నిలబడి బాధితుడిని పిలిచేందుకు అతని పేరు పెట్టి గట్టిగా అరిచాడు. వెంటనే బాధితుడు తన నివాసం మేడపై ఉండగా అక్కడి నుంచి దిగి మెల్లగా కిందకి దిగాడు.
ఆ కొరియర్ బాయ్ ప్రవర్తన తీరు కొంత అనుమానాస్పదంగా ఉండడంతో బాధితుడు ‘అకరతా’ పార్శిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి ఆన్‌లైన్‌లో నంబరు వెతికి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి ఫిర్యాదు రుసుము కింద రూ.10 చెల్లించాలన్నాడు. ఇక్కడే మొదలైంది గేమ్ అంతా. కొద్దిసేపటికే మరో ఫోన్ నంబరు నుంచి బాధితుడికి కాల్ వచ్చింది. ఆ ఫోన్ సంభాషణలో వ్యక్తిగతంగా ఫోన్‌పే ద్వారా నేరుగా పది రూపాయలు చెల్లించాలన్నాడు.
ఏపీకే ఫైల్ లింక్ క్లిక్ చేశాడు డబ్బు పోయింది : బాధితుడు ఆ డబ్బు పంపించే ప్రయత్నంలో ఉండగా ఆ మోసగాడు వాట్సాప్‌కు కస్టమర్‌కేర్ పేరిట ఏపీకే ఫైల్ పంపించాడు. వెంటనే దానిపై క్లిక్ చేయమన్నాడు. బాధితుడు ఆ ఫైల్‌పై క్లిక్ చేసిన మరుక్షణమే అతని ఖాతాలోంచి రూ.4 లక్షల 70 వేలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది. ఏమిటి ఇదని బాధితుడు అవతలి వ్యక్తిని కోపంతో నిలదీశాడు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
సరిచూసుకుని మీ డబ్బు మీ ఖాతాలో వెంటనే జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మోసగాడికి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాకుండా పోయింది. నిజం తెలుసుకున్న బాధితుడు (67) సైబర్ నేరగాళ్లకు చిక్కానని గ్రహించాడు. దీంతో వెంటనే హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపించి సామాన్య ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు క్షణాల్లో కొట్టేస్తున్నారు.
వామ్మో ఎంత తెలివి! - ఇంత పకడ్బందీగా, పద్దతిగా కూడా డబ్బులు కొట్టేస్తారా?
రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి!