Healthy Khichdi Recipe in Telugu : చాలా మంది ఇష్టంగా తినే రెసిపీలలో ఒకటి కిచిడీ. అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేసుకోవడానికి తగినంత టైమ్ లేనప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుంటుంటారు మెజార్టీ పీపుల్. అయితే, మీరు ఇప్పటివరకు కిచిడీని రకరకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి ఇలా వెరైటీగా అన్ని పప్పులతో కిచిడీని ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ కిచిడీని ఎంతో ఇష్టంగా తింటారు. సింగిల్పార్ట్ వంటకంగా చెప్పుకొనే ఇది తేలిగ్గా జీర్ణమవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా దీని కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనిలేదు. మరి, ఈ హెల్దీ కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - 2 కప్పులు
- కందిపప్పు - అర కప్పు
- శనగపప్పు - అర కప్పు
- పెసర పప్పు - అర కప్పు
- బంగాళదుంపలు - 2
- టమాటాలు - 2
- ఉల్లిపాయ - 2
- పచ్చిమిర్చి - 4
- క్యారెట్ - 3
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - చెంచా
- వెల్లుల్లి తరుగు - 2 చెంచాలు
- జీలకర్ర - ఒకటిన్నర చెంచా
- నూనె - తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బంగాళదుంపలను పొట్టు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీరను తరుక్కొని సిద్ధంగా పెట్టుకోవాలి.
- అదేవిధంగా బియ్యం, అన్ని రకాల పప్పులను వేరు వేరు బౌల్స్‌లో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. అది వేగాక ముందుగా తరుకున్న వెల్లుల్లి, పుదీనా తరుగు, ఉల్లిపాయ, క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి ముక్కలతో మిరియాల పొడి వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా కడిగి సిద్ధంగా ఉంచుకున్న బియ్యం, పప్పులు వేసి కలిపి అర నిమిషం పాటు వేయించుకోవాలి.
- అనంతరం తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఘుమఘుమలాడే వెరైటీ కిచిడీ" రెడీ!
ఇవీ చదవండి :
"జొన్నరవ్వ కిచిడీ" - ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది! పైగా ఆరోగ్యం బోనస్!
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే "చల్ది అన్నం" - ఇలా చేసుకుంటే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ!