ETV Bharat / offbeat

ఎగ్, ఓవెన్‌ లేకుండానే టేస్టీ "క్రెమ్​ కేరమెల్‌" - ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది! - EGGLESS CREME CARAMEL

-సూపర్ టేస్టీ డెజర్ట్​ క్రెమ్​ కేరమెల్ - ఓవెన్ లేకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!​

Eggless Creme Caramel Recipe
Eggless Creme Caramel Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 10:52 AM IST

Eggless Creme Caramel Recipe : మనలో చాలా మందికి స్వీట్లూ, డెజర్టులంటే ఎంతో ఇష్టం. ఇక రెస్టారెంట్లు, బేకరీల్లో దొరికే జున్నులాంటి "క్రెమ్ కేరమెల్​" చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. సూపర్​ టేస్టీగా ఉండే క్రెమ్​ కేరమెల్​ని సాధారణంగా ఎగ్​తో తయారు చేస్తుంటారు. కానీ, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎగ్​ లేకుండానే కమ్మని క్రెమ్ కేరమెల్​ రుచిని ఆస్వాదించవచ్చు. ఇది చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇంట్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌ లేకుండానే సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా పిల్లలు, పెద్దలు అందరు ఎంతో ఇష్టంగా తినే క్రెమ్ కేరమెల్​ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • మిల్క్​ బ్రెడ్​ స్లైసెస్-3
  • పాలు-అరకప్పు
  • షుగర్ పొడి -​ 3/4 కప్పు
  • వెనిలా కస్టర్డ్​ పౌడర్​-2 టీ స్పూన్లు
  • చిటికెడు-ఉప్పు
  • వెనీలా ఎసెన్స్​ -టీ స్పూన్
  • పంచదార- 2 టేబుల్ ​స్పూన్లు
  • మిల్క్ పౌడర్ - 2 టేబుల్​ స్పూన్లు
  • ప్యాకెట్​ పెరుగు-అరకప్పు
  • కండెన్స్​డ్​ మిల్క్​-3/4 కప్పు (180 గ్రాములు)

తయారీ విధానం :

  • ముందుగా మిల్క్​ బ్రెడ్​ ఎడ్జెస్​ని కట్​ చేసుకోండి. తర్వాత బ్రెడ్​ని ముక్కలుగా కట్​ చేసుకోండి. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని బ్రెడ్​ క్రంప్స్​ మాదిరిగా పొడి చేసుకోండి. (సాధ్యమైనంత వరకు పాత మిల్క్ బ్రెడ్​ యూజ్​ చేయండి.)
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి షుగర్​ పొడి పాన్​పై చల్లండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేస్తే షుగర్​ నెమ్మదిగా కరుగుతుంది. పంచదార కరిగేంత వరకు గరిటె పెట్టి తిప్పకండి.
  • షుగర్​ పూర్తిగా కరిగి.. తేనె కలర్లోకి రాగానే నెయ్యి రాసుకున్న కేక్​ మౌల్డ్​లోకి పోసుకోండి. షుగర్​ సిరప్​ టిన్​ మొత్తం స్ప్రెడ్​ చేయాలి.
  • ఇప్పుడు మిక్సీ గిన్నెలో పాలు, వెనిలా కస్టర్డ్​ పౌడర్​, ఉప్పు, అరకప్పు గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడి, వెనీలా ఎసెన్స్, పంచదార, మిల్క్ పౌడర్, పెరుగు, కండెన్స్​డ్​ మిల్క్ వేసుకుని బాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆపై ఈ మిల్క్​ని.. కేక్​ గిన్నెలో టీ జాలీతో పోసి మొత్తం స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • తర్వాత మౌల్డ్​పై సిల్వర్​ ఫాయిల్​ చుట్టండి. అవసరమైతే దారం కూడా కట్టండి. ఇప్పుడు సిల్వర్​ ఫాయిల్​పై మూడు చోట్ల చిన్న గాట్లు పెట్టండి.
  • ఆపై స్టీమ్​ చేయడం కోసం స్టౌపై గిన్నె పెట్టి 3 గ్లాసుల నీళ్లు పోయండి. ఇందులో చిన్న స్టాండ్​ పెట్టి నీటిని వేడి చేయండి.
  • ఆపై క్రెమ్​ కేరమెల్​ గిన్నెను ఉంచండి. దీనిని 15 నిమిషాలు హై ఫ్లేమ్​ మీద, 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్​ మీద స్టీమ్​ చేయండి.
  • క్రెమ్​ కేరమెల్​ పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మూడు గంటలు ఫ్రిడ్జ్​లో పెట్టండి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్​ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్​ లెస్​ క్రెమ్​ కేరమెల్​ మీ ముందుంటుంది.
  • ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఓ సారి ఇంట్లో ఇలా క్రెమ్​ కేరమెల్ ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది.

ప్రపంచంలో నెంబర్-2 బెస్ట్ స్వీట్​గా మన రసమలై - ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి!

స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అదిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.