బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ నటుడు శక్తి కపూర్ గారాల పట్టి అయిన ఈ అమ్మడు తన నటనతో బీటౌన్ ప్రేక్షకులను కట్టిపడేసింది.. 'సాహో' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ చిన్నది. పలు హిందీ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో శ్రద్ధాకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి పోస్ట్‌ల కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తుంటారు.. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.. దానికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జోడించింది. "చూడ్డానికి బాగున్నా. పెళ్లి చేసుకోవచ్చా?'" అంటూ సరదా క్యాప్షన్ పెట్టింది.. ఇది చూసిన అభిమానులు ఈ అమ్మడి క్యూట్ లుక్స్‌కు ఫిదా అయిపోయి ఓకే చెప్తున్నారు. కొందరైతే 'మ్యారీ మీ' అంటూ శ్రద్ధా ముందు ప్రపోజల్ పెడ్తున్నారు.