ETV Bharat / technology

స్టన్నింగ్ లుక్​తో పాటు అదిరే ఫీచర్లతో హానర్ మొబైల్స్- చూస్తే కొనకుండా ఉండలేరుగా..! - HONOR 300

త్వరలో 'హానర్ 300' సిరీస్- లాంఛ్​కు ముందే కీలక స్పెక్స్ లీక్!

Honor 300 Smartphone
Honor 300 Smartphone (Honor)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 24, 2024, 7:12 PM IST

Honor 300: ఆకర్షణీయమైన లుక్​, అదిరే ఫీచర్లతో హానర్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్లు రాబోతున్నాయి. కంపెనీ త్వరలో తన 'హానర్ 300' సిరీస్​ను చైనాలో లాంఛ్ చేయనుంది. ఈ సిరీస్​లో 'హానర్ 300', 'హానర్ 300 ప్రో' అనే రెండు మోడల్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా 'హానర్ 300' సిరీస్​ కలర్ ఆప్షన్స్​ను రివీల్ చేసింది.

అదే సమయంలో లాంఛ్​కు ముందే ఈ స్మార్ట్​ఫోన్లలోని కొన్ని స్పెషల్ ఫీచర్లు లీక్ అయ్యాయి. దీని బేస్ వేరియంట్ ఫ్లాట్ స్క్రీన్ డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్​లోని కొన్ని కీలక స్పెక్స్​తో పాటు ర్యామ్​, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ల గురించి టిప్‌స్టర్ కొన్ని వివరాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

డిజైన్ అండ్ కలర్ ఆప్షన్స్: త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'హానర్ 300' డిజైన్‌ను కంపెనీ గురువారం Weibo పోస్ట్‌లో వెల్లడించింది. "Lu Yanji", "Yulongxue", "Tea Card Green", "Cangshan Ash" వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో రానున్నట్లు మరో పోస్ట్​లో రివీల్ చేసింది. కంపెనీ పంచుకున్న పోస్ట్​లో మొబైల్ బ్యాక్ ప్యానెల్​.. పర్పుల్, బ్లూ, వైట్ రంగుల్లో మార్బుల్ ప్యాటెర్న్​తో​ ఉంది.

'హానర్ 300' వెనక ప్యానెల్ లెఫ్ట్ కార్నర్​లో​ అసిమెట్రికల్ హెక్సాగోనల్ కెమెరా మాడ్యూల్​ను కలిగి ఉంది. ఇందులో ​పిల్-షేప్​లో LED ప్యానెల్​తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్​కు ఒక వైపు "Portrait Master" అనే పదం కన్పిస్తుంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఫోన్​కు కుడి వైపున ఉన్నాయి. మరో పోస్ట్​లో కంపెనీ.. ఫోన్ కేవలం 6.97 మిమీ మందంతోనే వస్తుందని వెల్లడించింది.

స్పెసిఫికేషన్స్: టిప్​స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్​ Weibo పోస్ట్ ప్రకారం.. 'హానర్ 300' సిరీస్​ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండొచ్చు. ఇందులో ప్లాస్టిక్ మిడిల్ ఫ్రేమ్, ఫ్లాట్ డిస్‌ప్లే, ఇన్-డిస్​ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని టిప్​స్టర్​ పేర్కొంది.

మరో నివేదిక ప్రకారం.. బేస్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ఉండొచ్చు. ఇక ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉండొచ్చు. బేస్ 'హానర్ 300'ను 8+256GB, 12+256GB, 12+512GB, 16+512GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందించొచ్చు.

ఇట్స్​ టైమ్​ టు ప్లే- 'బ్లాక్ ఫ్రైడే సేల్‌'లో మొదలైన ఆఫర్ల హంగామా- గేమింగ్ లవర్స్​కు ఇక పండగే!

లగ్జరీ కారు కొనడం మీ కలా..? అయితే వెంటనే త్వరపడండి.. త్వరలో వాటి ధరలు పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.