Couple Saves Man Life : పల్స్ పడిపోయి మనిషిలో ఎలాంటి చలనం లేదు. ఓ వైద్యుడు పరీక్షించి మృతి చెందాడని ధ్రువీకరించాడు. మరణ ధ్రువీకరణ పత్రలం తీసుకుని స్వగ్రామానికి వెళ్దామని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ డ్రైవర్ దంపతులు చివరి ప్రయత్నంగా సీపీఆర్ చేయగా ఆ ప్రయత్నం ఫలించింది. నిండు ప్రాణాన్ని కాపాడి విషాదంలో మునిగిపోయిన కుటుంబంలో సంతోషం నింపారు. ఇందుకు కృతజ్ఞతగా అంబులెన్స్ డ్రైవర్ దంపతులను శనివారం బాధితుడి కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకొచ్చి సన్మానం చేశారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం రేఖపల్లికి చెందిన మామిడి రాజు, కొడుకు మధు కారులో ఈ నెల 11న జంగారెడ్డి గూడెం వెళ్లి వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి వచ్చేసరికి రాత్రి 8 గంటలు దాటింది. నిద్రలో ఉన్న తన తండ్రి అపస్మారక స్థితిలో వెళ్లడంతో పాల్వంచలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గుండెపోటులా ఉందని అంబులెన్స్‌లో కొత్తగూడెం, అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడి ఓ వైద్యశాలలో వైద్యుడు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. విషయాన్ని స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు తెలిపారు.
శభాష్ పోలీసన్నా - బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి - సీపీఆర్‌తో ప్రాణం పోసిన ఎస్సై
ఆఖరి ప్రయత్నంగా సీపీఆర్ : ఖమ్మం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని కుటుంబ సభ్యులు సూచించారు. దీంతో భద్రాచలానికి చెందిన మహిశ్రీ అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. అంబులెన్స్‌లో నర్సింగ్ టెక్నీషియన్ నవ్యశ్రీ తన భర్త అయిన డ్రైవర్ కట్టప్పకు ఆఖరి ప్రయత్నంగా సీపీఆర్ చెద్దామని అనుకున్నారు. వెంటనే ఆయన ఆ ప్రక్రియ మొదలు పెట్టారు. దీంతో క్రమేపీ పల్స్ పెరగడం మొదలైంది వెంటనే డ్రైవర్ తనకు పరిచయం ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లారు.
వారు చికిత్స అందించడంతో 24గంటల తర్వాత రాజు స్పృహలోకి వచ్చారు. మరో రెండు రోజులు అక్కడే ఉంచి చికిత్స చేశారు. రెండ్రోజులు క్రితం రాజుని కుటుంబ సభ్యులు స్వగ్రామం రేఖపల్లికి తీసుకువచ్చారు. తన ప్రాణాలు కాపాడిన కట్టప్ప దంపతులకు గ్రామంలో రాజు కుటుంబ సభ్యులు సత్కారం చేశారు. వీఆర్‌పురం, కూనవరం టీడీపీ నాయకులు దంపతులను అభినందించారు.
గుండెపోటుతో కుప్పకూలిన మహిళ - సీపీఆర్ చేసి బతికించిన కానిస్టేబుల్
Viral Video : పాముకు ఊపిరి ఊది.. బతికించిన పోలీస్..! వీడియో వైరల్