ETV Bharat / spiritual

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు - పూర్తి షెడ్యూల్ ఇదే!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల వివరాలు మీ కోసం!

Tiruchanur Sri Padmavati Ammavaru
Tiruchanur Sri Padmavati Ammavaru (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Tiruchanur Brahmotsavam 2024 : ప్రతి ఏడాది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తిక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది నవంబర్ 27వ తేదీ నుంచి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఏ రోజు వాహన సేవ ఉంటుంది? తదితర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదిగో!
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబర్ 6వ తేదీతో ముగుస్తాయి. అందుకే ఈ బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • 27 నవంబర్ 2024 బుధవారం
    ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు - లక్ష కుంకుమార్చన జరుగనుంది. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు - అంకురార్పణం - పుణ్యహవచనం, రక్షా బంధనం, సేనాధిపతి ఉత్సవం జరగనున్నాయి.
  • 28 నవంబర్ 2024 గురువారం
    ఉదయం ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చిన శేష వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
  • 29 నవంబర్ 2024 శుక్రవారం
    ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు పెద్దశేషవాహనం; రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతారు.
  • 30 నవంబర్ 2024 శనివారం
    ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సింహ వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతారు.
  • 1 డిసెంబర్ 2024 ఆదివారం
    ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కల్ప వృక్ష వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
  • 2 డిసెంబర్ 2024 సోమవారం
    ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు పల్లకీ ఉత్సవం, వ‌సంతోత్స‌వం జరుగుతాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
  • 3 డిసెంబర్ 2024 మంగళవారం
    ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌భూపాల వాహ‌నం, మధ్యాహ్నం స్వర్ణరథం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
  • 4 డిసెంబర్ 2024 బుధవారం
    ఉదయం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరగనున్నాయి.
  • 5 డిసెంబర్ 2024 గురువారం
    ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ జరగనున్నాయి.
  • 6 డిసెంబర్ 2024 శుక్రవారం
    ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం ఘనంగా జరగనుంది. ఈ చక్రస్నాన ఉత్సవాన్ని పంచమితీర్థం అని కూడా అంటారు. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
  • 7 డిసెంబర్ 2024 శనివారం
    ఈ రోజున గురువారం నాడు జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసీ, తెలియక జరిగిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తారు.

ముక్కోటి దేవతలు పాలుపంచుకునే బ్రహ్మోత్సవాలను కళ్లారా చూడడం పూర్వజన్మ సుకృతం. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కళ్లారా చూద్దాం. తరిద్దాం. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.