Rohit Sharma Records : ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో టచ్‌లోకి వచ్చిన టీమ్ఇండియా రోహిత్ శర్మ మరో భారీ రికార్డ్‌పై కన్నేశాడు. వన్డేల్లో ఓ అరుదైన రికార్డుకు హిట్‌మ్యాన్ అతి చేరువలో ఉన్నాడు. మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. అయితే రోహిత్ శర్మ ఇప్పటివరకు 267 వన్డేల్లో 49.27 సగటుతో 10,987 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందున్నాడు. అతడు 222 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సచిన్, పాంటింగ్ వరుసగా ఉన్నారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన ఆటగాడు
- విరాట్ కోహ్లీ (భారత్) - 222 ఇన్నింగ్స్‌ల్లో
- సచిన్ టెందూల్కర్ (భారత్) - 276 ఇన్నింగ్స్‌ల్లో
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 286 ఇన్నింగ్స్‌ల్లో
- సౌరభ్ గంగూలీ (భారత్) - 288 ఇన్నింగ్స్‌ల్లో
- జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 293 ఇన్నింగ్స్‌ల్లో
- కుమార సంగక్కర (శ్రీలంక) - 318 ఇన్నింగ్స్‌ల్లో
- ఇంజామామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) - 324 ఇన్నింగ్స్‌ల్లో
- సనత్ జయసూర్య (శ్రీలంక) -354 ఇన్నింగ్స్‌ల్లో
- మహేల జయవర్దెనె (శ్రీలంక) - 368 ఇన్నింగ్స్‌ల్లో
రోహిత్ శర్మ సాధించిన రికార్డులు
IND VS ENG Rohit Sharma : రోహిత్ శర్మ తాజా శతకంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి దూసుకొచ్చాడు. రాహుల్ ద్రవిడ్ (10,889 పరుగులు, 318 ఇన్నింగ్స్ లు)ను అధిగమించి హిట్ మ్యాన్ పదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 10,964 పరుగులు (264 ఇన్నింగ్స్ లు)చేశాడు.
ఇక భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. హిట్‌మ్యాన్ మరోసారి విజృంభిస్తే, ఈ మ్యాచ్‌లోనే అతడు ఈజీగా ఈ మైలురాయి అందుకునే ఛాన్స్ ఉంది. మూడో మ్యాచ్‌కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
ఒక్క సెంచరీ వల్ల ఏమీ మారదు- నాకు ఆ క్లారిటీ ఉంది : రోహిత్ శర్మ
సెంచరీతో రోహిత్ శర్మ విధ్వంసం - రెండో వన్డేలోనూ టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ