ETV Bharat / bharat

ప్రభుత్వ ఏర్పాటుకు 'మహా'యుతి సిద్ధం - సీఎం అభ్యర్థిపై వీడని ఉత్కంఠ!

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు మహాయుతి కూటమి సిద్ధం - సీఎం రేసులో దేవేంద్ర ఫడణవీస్‌, ఏక్‌నాథ్‌ శిందే!

Maharashtra CM
Mahayuti (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Maharashtra CM Swearing In Ceremony : మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సోమవారమే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశముందని శిందే వర్గం శివసేన నేత దీపక్‌ కేసర్కార్‌ వెల్లడించారు. సీఎంతో పాటు ఆయన డిప్యూటీలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలిపారు. అయితే, బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌, ఏక్‌నాథ్‌ శిందే సీఎం రేసులో ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో పూర్తికానుంది. గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి పీఠం ఎవరిదంటే?
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహాయుతి నేతలు, బీజేపీ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోల్‌ కూడా కేవలం 200 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు గుర్తు చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 234 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ 46 స్థానాలకే పరిమితమైంది. మహారాష్ట్రలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చారని చంద్రశేఖర్‌ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇప్పుడు ఏ పార్టీకీ దక్కదని అందుకు కాంగ్రెస్‌ వైఖరే కారణమని విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే కనీసం 29 స్థానాలు నెగ్గాలి. విపక్ష పార్టీల్లో ఏ పార్టీకి కూడా ఆ స్థాయిలో సీట్లు రాలేదు.

ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి?
మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయం సాధించడంతో కూటమిలోని అగ్రనాయకులకు ఏ పదవులు దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏక్‌నాథ్‌ శిందేకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారని వార్తలు వస్తున్నాయి. ఉపముఖ్యమంత్రితో పాటు కీలక శాఖలను ఆయనకే ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు శిందే ఒప్పుకుంటారా? లేదా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.