పోప్ ఫ్రాన్సిస్ కోలుకోవాలని భక్తుల ప్రార్థనలు - PRAYERS FOR POPE FRANCIS

Prayers For Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో, ఆయన కోలుకోవాలని భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. పోప్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, అయితే ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని, ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారని వాటికన్ సిటీ వెల్లడించింది. వైద్యులు ఆయనకు హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారని పేర్కొంది. వైద్యులు జరిపిన పరీక్షల్లో ఆయన కిడ్నీ విఫలం అయినట్లు వెల్లడైందని తెలిపింది. (Associated Press)
Published : Feb 24, 2025, 1:21 PM IST