తెలంగాణ

telangana

ETV Bharat / photos

మీకు తెలుసా? - వినాయకుడి రూపం వెనుక ఎన్ని పరమార్థాలు ఉన్నాయో! - Lord Ganesha Rupam Meaning - LORD GANESHA RUPAM MEANING

Meaning of Ganesh Rupam: హిందూ సంప్రదాయంలో తొలి పూజ ఆ గణపతికే సొంతం. సమస్త విఘ్నాలను తొలగించి తమకు ముక్తిని ప్రసాదించేది ఆయనే అని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలను తొలగించి, జ్ఞానాన్ని ప్ర‌సాదించేవాడని నమ్ముతారు. అయితే.. వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థాలు మీకు తెలుసా? (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 5:16 PM IST

ఏనుగు తల: ఇది జ్ఞానం, అవగాహనకు ప్రతీక. జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన విచక్షణా బుద్ధిని సూచిస్తుందని పండితులు అంటున్నారు. (ETV Bharat)
వినాయకుడి రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది. మరి దీని అర్థం ఏమంటే.. త్యాగం, పట్టుదలకు గుర్తుగా చెబుతున్నారు. పురాణాల ప్రకారం.. వ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి గణేశుడు తన దంతాన్ని విరిచి ఇచ్చాడట. (ETV Bharat)
వినాయకుడి చేతిలో ఎప్పుడూ మోదకాలు ఉంటాయి. అవి అంతరంగంలోని మాధుర్యాన్ని, స్వీయ-సాక్షాత్కార ఆనందాన్ని సూచిస్తాయట. మోదకం తినడం వల్ల జ్ఞానం, సంపదలు లభిస్తాయని భావిస్తారు. (ETV Bharat)
గణపతి వాహనం ఎలుక. ఈ ఎలుక మనకి ఉండే కోరికలకు ప్రతీక. మన కోరికలపై మనకి నియంత్రణ ఉండాలని చూపించటం కోసమే ఎలుక వాహనంపై తిరుగుతాడట. (ETV Bharat)
ముడ్గల్ పురాణం ప్రకారం.. వినాయకుడి ‘ఏకదంతం' విశ్వంలో శక్తి, ప్రకృతిలో ఏకత్వానికి అర్థం. తొండం నేర్పరితనాన్ని సర్దుకుపోవటాన్ని సూచిస్తుందట. (ETV Bharat)
చిన్న నోరు: వినాయకుడి బొమ్మల్లో పెద్ద చెవులు, చిన్న నోరు ఉంటాయి. ఇది మనకి ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని నేర్పిస్తుంది. ఇలా ఉండటం వలన మనం తెలివిగా మారతాం. (ETV Bharat)
చిన్న కళ్లు: గణేషుడి చిన్న కళ్లు శ్రద్ధ, ఏకాగ్రత చాలా ముఖ్యమని చూపిస్తున్నాయి. ఏ విషయాన్ని అయినా లోతుగా చూడటం అవసరం. (ETV Bharat)
వినాయకుడి పెద్దపొట్ట వల్ల ఆయనకి లంబోదరుడనే పేరు వచ్చింది. దీని అర్థం మన మార్గంలో వచ్చేవి ఏమైనా సంతోషంగా, ప్రశాంతంగా ఒప్పుకుని జీర్ణం చేసుకోవాలి అని. వినాయకుడి పొట్టచుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం. (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details