Oldest Miss Universe Contestant : అర్జెంటీనాలో ఓ భామ తృటిలో విశ్వసుందరి పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోయింది. ఆమె వయసు 61ఏళ్లు. ఆ అందాల బామ్మ పేరు అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్.. శనివారం జరిగిన పోటీల్లో రోడ్రిగ్జ్‌కు మిస్ అర్జెంటీనా కిరీటం దక్కలేదు. మిస్ అర్జెంటీనా టైటిల్‌ను సాధిస్తే ఆమెకు ఆ దేశం తరఫున విశ్వసుందరి పోటీలో పాల్గొనే అవకాశం ఉండేది.. అలెజాండ్రాకు మిస్ అర్జెంటీనా టైటిల్ దక్కకపోయినప్పటికీ బెస్ట్ ఫేస్ కేటగిరీలో విజేతగా నిలిచింది. అర్జెంటీనాలో బెస్ట్ ఫేస్. బెస్ట్ ఈవ్‌నింగ్ గౌన్. బెస్ట్ స్విమ్‌సూట్. మోస్ట్ ఎలిగెంట్ వంటి విభాగాలకు శనివారం పోటీలు నిర్వహించారు.. వాటిలో బెస్ట్ స్విమ్‌సూట్ కేటగిరీలో విజేతగా నిలిచిన 29 ఏళ్ల మోడల్ మగాళి బెనెజం కోర్తే మిస్ అర్జెంటీనా టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ఆమె నవంబర్‌లో మెక్సికోలో జరగనున్న విశ్వసుందరి పోటీలకు అర్హత సాధించింది.. బెస్ట్ ఫేస్ విభాగంలో విన్నర్‌గా నిలిచిన అలెజాండ్రా విగ్రహం వంటి శరీరాకృతి. పొడవాటి జుట్టు. కోమలమైన ముఖంతో న్యాయనిర్ణేతలు. యువతను ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. చర్మాన్ని మృదువుగా ఎలా ఉంచుకోవాలి. అందంగా ఎలా కనపడాలన్న టిప్‌లను కూడా వివరించింది.. వయసు కేవలం అంకె మాత్రమేని సామెతలో నిజం ఉందని చెబుతూ యువతను ఉత్సాహపరచింది.. 73ఏళ్ల నుంచి మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. తొలుత పెళ్లి కాని యుక్త వయసు వారే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించేవారు. 1968 మిస్ అమెరికా పోటీల తర్వాత ఫెమినిస్టులు వీటి నిర్వహణపై ఆందోళనలు లేవనెత్తారు.. బ్రా-బర్నింగ్. మీటూ వంటి నిరసనలతో ఇది ఉద్ధృతమైంది. అందం శరీరాన్ని బట్టి కాదని. ఆత్మవిశ్వాసం. మనసుపై ఆధారపడి ఉందన్న వాదనలు వెల్లువెత్తాయి. ఫలితంగా విశ్వసుందరి పోటీ నిబంధనలను నిర్వాహకులు మారుస్తూ వస్తున్నారు.. వివాహితులు. గర్భిణులు. స్వలింగ సంపర్కులు. ఇలా ఎవరైనా పాల్గొనే అవకాశం లభించింది. ముస్లిం దేశాల యువతులు బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా బుర్కినిస్ అనే వస్త్రాలను ధరించి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.. తాజాగా వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు దాటిన ఎవరైనా విశ్వసుందరి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించారు.