అమెరికా అధ్యక్ష ఎన్నికలు - ఎవరు గెలిచినా ఆ ప్రభావం భారత్‌పై ఉంటుందా? - US President Election Pratidhwani - US PRESIDENT ELECTION PRATIDHWANI
US President Election 2024 : ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నిక హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రత్యర్థులు ట్రంప్, కమలాహారిస్ ఒకరిపై ఒకరు మాటల అస్త్రాలను విసురుకుంటూ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచినా ఆ ప్రభావం భారత్‌పై ఏ విధంగా ఉంటుంది? అనే విషయాలపై నేటి ప్రతిధ్వని.
Published : Aug 25, 2024, 10:53 AM IST
US Election Today Pratidhwani : అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబరు5 వైపు కాలం వేగంగా కరిగిపోతుండడంతో ఇరు శిబిరాలు ప్రచారంలో జోరుగు పెంచాయి. ఎన్నికల ఘట్టం చివరిదశలో ఇరువర్గాలు పై చేయి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అతడిపై జరిగిన హత్యాయత్నం ట్రంప్ గ్రాఫ్ పెంచితే బైడెన్ స్థానంలో కమలా హారిస్ దూకుడు డెమోక్రాట్లకు కొత్త ఊపిరులు అందించింది. మరి వీరిద్దరి మధ్య సగటు అమెరికన్ ఓటర్ ఏం ఆలోచిస్తున్నాడు? రిపబ్లికన్లు, డెమెక్రాట్ల మధ్య ఎవరి ఛాన్సెస్ ఎంత? ఎవరు గెలిస్తే ఆ ప్రభావం ఇండియాపై ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.