Pratidhwani On Lakes Protection :హైదరాబాద్‌లో ఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. చిక్కిపోతున్న చెరువులకు చిరుదీపంలా హైడ్రా చర్యలున్నాయి. ఒత్తిళ్లకు లొంగకుండా జలవనరుల్ని కాపాడేందుకు దూకుడు ప్రదర్శిస్తోంది. ఆక్రమణలు తొలగింపు విషయంలో ఆ విభాగం ప్రదర్శిస్తున్న దూకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు చరిత్రకు సాక్ష్యంగా, ప్రజల జీవనోపాదికి అండగా నిలిచిన చెరువుల్ని ఇకనైనా కాపాడుకోవడానికి మాకూ ఓ హైడ్రా తరహా విభాగం కావాలంటూ పౌర సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
చెరువులను చెర నుంచి విడిపిద్దాం - భవిష్యత్ తరాలకు జీవనాధారాన్ని అందిద్దాం - PRATIDHWANI ON LAKES Protection - PRATIDHWANI ON LAKES PROTECTION
Pratidhwani On Ponds Protection: హైదరాబాద్‌లో చెరువులు, కుంటల ఆక్రమణలపై నిఘా పెట్టిన హైడ్రా తన పనితీరును కనబరుస్తూ దూసుకుపోతోంది. జలవనరులను కాపాడాలనే ఉద్దేశంతో ఆక్రమణలను కూల్చివేస్తు ముందుకు సాగుతోంది. దీంతో రెండు తెలుగురాష్ట్రాల్లో హైడ్రా చర్చనీయాంశంగా మారింది. అసలు రాష్ట్రం, ప్రాంతం ఏదైనా చెరువులు, నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? చెరువులు మనకు ఎందుకు అవసరం?
Published : Aug 28, 2024, 10:58 AM IST
చెరువులు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌తో పాటు అసలు రెండు రాష్ట్రాల్లోని చెరువులు, వాగులు, కుంటల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాల్సి ఉంది? ఒకప్పుడు చెరువుల నగరంగా ఉన్న భాగ్యనగరంలో ఇప్పుడెన్ని మిగిలాయి? అసలు రాష్ట్రం ప్రాంతం ఏదైనా చెరువులు, నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? చెరువులు మనకు ఎందుకు అవసరం? ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.