తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బ్యాంకుల చుట్టూ తిరగలేక ప్రైవేట్ అప్పులు చేస్తున్న ప్రజలు - తిరిగి చెల్లించలేక తిప్పలు - POLICE INSPECTS on MONEY LENDERS - POLICE INSPECTS ON MONEY LENDERS

Prathidwani Debate on Private Money Lenders : చిరువ్యాపారులు, అన్నదాతలు రుణాల మంజూరులో బ్యాంకులు అలసత్వం వహిస్తున్నాయి. దీంతో ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగలేక ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. దీంతో వడ్డీ అల్పాదాయ వర్గాలు ఆగమవుతున్నాయి. మరి ఈ విధంగా వసూలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.

Prathidhwani Debate on Private Lenders
Prathidhwani Debate on Private Lenders

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 9:56 AM IST

Prathidhwani Debate on Private MoneyLenders : చిరువ్యాపారులు, చిరుద్యోగులు, రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు అలసత్వం వహిస్తున్న కారణంగా ప్రజలు ప్రైవేట్ అప్పులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాల్ని అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పుల కోసం ఖాళీ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను ప్రజలు తనఖా పెడుతున్నారు. నగలు, స్థిరాస్తి డాక్యుమెంట్లు కుదవపెడుతున్న గ్రామీణ జనం. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోతున్నాయి అల్పాదాయ వర్గాలు.

Money Lenders Harassment on Borrowers :అప్పులిచ్చిన వారి ఆగడాలను భరించలేని వారు కొత్త అప్పులు చేస్తూ, ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతుంటే, ఆ వేధింపులు తట్టుకోలేని కొందరు అత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు వడ్డీ వ్యాపారులు ప్రభుత్వం నుంచి ఏఏ అనుమతులు పొందాలి? అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? వడ్డీ వ్యాపారుల ఆగడాల బాధితులు ఎవరిని సంప్రదించాలి? మరోవైపు అసలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏ వృత్తుల వారికి అధికంగా రుణాలిస్తున్నాయి? ప్రైవేట్ అప్పుల ఊబి నుంచి పేదలను బయటపడేసే మార్గం ఏమిటి? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details