అదుపు తప్పుతున్న ఆలోచనలు - చిక్కుల్లో పడేస్తున్న ఉద్వేగాలు
అదుపు తప్పుతున్న ఆలోచనలు, ఉద్వేగాలు చిత్రవధ చేస్తున్నాయా - మానసిక ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగగ్రత్తలు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Oct 11, 2024, 11:12 AM IST
Prathidhwani Debate On Mental Health: తనువు, మనస్సు మనల్ని నడిపించే జోడెడ్లు ఈ రెండూ! కానీ రెండింటికీ మనం అదే ప్రాధాన్యం ఇస్తున్నామా అంటే సమాధానం లేదు. అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. అదుపు తప్పుతున్న ఆలోచనలు, ఉద్వేగాలు చిత్రవధ చేస్తున్నాయి. మొదట్లో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితాల్నే బలిపీఠంపైకి నెడుతున్నాయి. ప్రతి 100లో 30 మంది, ప్రతి 10మందిలో ముగ్గురు ఏదొక రకంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తో సతమతం అవుతున్నారంటున్నాయి. స్టడీస్, ఉద్యోగాలు, వ్యాపారాల వెంట పరుగులు తీసేవారి జీవితాలు మరింత దయనీయం. కానీ ఎందుకీ దుస్థితి? శారీరక ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ మానసిక ఆరోగ్యంపై ఎందుకు ఉండడం లేదు? ఇకనైనా దిద్దుకోవాల్సిన, సర్దుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.