తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రాష్ట్రంలో వెంచర్ల ఏర్పాట్లు, స్థలాల అమ్మకాల్లో చట్టాల ఉల్లంఘన - మరి రెరా యాక్ట్ సంగతేంటి? - RERA Act in Telangana - RERA ACT IN TELANGANA

RERA Act in Telangana: తెలంగాణ అభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలకంగా మారింది. ఓవైపు కొనుగోళ్లు, అమ్మకాలతో సర్కార్ భారీగా ఆదాయం సమకూరుతోంది. మరోవైపు వెంచర్ల ఏర్పాట్లలో చట్టాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో రియల్టర్ల అక్రమాలతో జనం నష్టపోతున్నారు. ఈ తరుణంలో రియల్‌ మోసాలపై సీఎం రేవంత్​రెడ్డి సీరియస్‌ అయ్యారు. రెరాను కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. మరీ రాష్ట్రంలో రెరా చట్టం ఎలా అమలు జరుగుతోంది? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.

Rera Act in Telangana
Real estate sector in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 12:01 PM IST

Prathidhwani on RERA Act in Telangana :రాష్ట్ర అభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలకపాత్ర పోషిస్తోంది. రాజధాని హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ స్థిరాస్తి వెంచర్ల ఏర్పాట్లు, స్థలాల అమ్మకాల్లో కొందరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Telangana Government on RERA Act: ఈ పరిస్థితుల్లో రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలంటూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌కు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. అసలు తెలంగాణలో రెరా చట్టం ఎలా అమలవుతోంది? అనుమతి లేకుండా వెంచర్లు వేసి, వ్యాపారం చేస్తే రెరా చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? రియల్‌ మోసాల్లో బాధితులు ఎవరిని సంప్రదించాలి? అనుమతి లేకుండా వెంచర్లు వేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? చెల్లించిన డబ్బుతిరిగి పొందడంతోపాటు పరిహారం కోరవచ్చా? రియల్‌ఎస్టేట్‌ సంస్థలు పాటించాల్సిన నిబంధనలు ఏమిటి? అనుమతుల్లేని స్థిరాస్తి సంస్థలపై ఇటీవల భారీగా జరిమానాలు. రెరా, ట్రైబ్యునల్‌, వినియోగదారుల కమిషన్‌ మధ్య సమన్వయం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details