సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా - ఆన్లైన్ క్యాంపెయినింగ్‌కు ఎన్నికల కోడ్ అమలవుతుందా?
Prathidhwani Debate on Election Campaign : సార్వత్రిక ఎన్నికల సమరంలో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రత్యేక గ్రూప్‌లు, వెబ్‌పేజీలు ఏర్పాటు చేసుకున్నాయి. మరి సోషల్ మీడియాలో ఎన్నికల నియమావళిని అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? పార్టీలు, నాయకులు పాటించాల్సిన నిబంధనలు ఏంటి? ఇదే అంశంపై ప్రతిధ్వని.
Published : Mar 20, 2024, 10:02 AM IST
Prathidhwani Debate on Election Campaign :సార్వత్రిక ఎన్నికల సమరంలో సోషల్ మీడియా వేదికలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే రాజకీయపార్టీలు ప్రత్యేక యాప్‌లు, గ్రూప్‌లు, వెబ్‌పేజీలు ఏర్పాటు చేసుకుని ఓటర్లకు సందేశాలిస్తున్నాయి. డిజిటల్ యుగంలో అధునాతన ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రజలకు చేరువ అవుతున్నారు నేతలు. అయితే సామాజిక వేదికల్లో కుప్పలుతెప్పలుగా వచ్చిపడే సమాచారంలో ఏది వాస్తవం, ఏది అబద్ధం అని గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎన్నికల నియమావళిని అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? ఫేక్‌న్యూస్‌ను గుర్తించడం కోసం ప్రజలు ఏఏ అంశాలపై అవగాహన పెంచుకోవాలి? పార్టీలు, నేతలు పాటించాల్సిన నిబంధనలు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.