తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కేవలం రూ.380కే హైదరాబాద్​ సిటీ టూర్​ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు! - HYDERABAD ONE DAY TOUR PACKAGE

- ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా హైదరాబాద్​ సిటీ టూర్​ - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీ

Telangana Tourism Hyderabad One Day Tour
Telangana Tourism Hyderabad One Day Tour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2025, 1:49 PM IST

Telangana Tourism Hyderabad One Day Tour :చారిత్రక కట్టడాలు, పురాతన ప్యాలెస్​లు, రాచరికానికి అద్దం పట్టే కోటలు, రుచికరమైన బిర్యానీ, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్​లో లేనిదంటూ ఏదీ లేదు. అందుకే చాలా మంది వీలు కుదిరినప్పుడల్లా వీటిని విజిట్​ చేస్తుంటారు. మరి మీరు కూడా హైదరాబాద్​లోని ఫేమస్​ ప్లేసులను చూడాలనుకుంటున్నారా? వీకెండ్​లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది తెలంగాణ టూరిజం. అతి తక్కువ ధరకే ఒక్కరోజులోనే సిటీ మొత్తం కవర్​ చేసేలా ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ టూరిజం హైదరాబాద్​ సిటీ హెరిటేజ్​ కమ్​ మ్యూజియం టూర్​ పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో బిర్లా మందిర్, చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్లో షాపింగ్ సహా ఇతర ప్రదేశాలు ఎంజాయ్​ చేయవచ్చు. ఏసీ, నాన్ఏసీ బస్సుల ద్వారా ప్రయాణం ఉంటుంది.

ప్రయాణ వివరాలు:

  • ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట యాత్రి నివాస్ నుంచి టూర్​ ప్రారంభమవుతుంది.
  • 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర ఎక్కొచ్చు.
  • 8:15 గంటలకు బషీర్‌బాగ్ CRO ఆఫీస్ దగ్గర కూడా బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.
  • బషీర్​బాగ్​ నుంచి జర్నీ స్టార్ట్​ అయిన తర్వాత ముందుగా బిర్లా మందిర్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • ఆ తర్వాత చౌమహాల్లా ప్యాలెస్​, చార్మినార్, మక్కా మసీద్ విజిట్​ చేస్తారు.
  • అక్కడి నుంచి లాల్ బజార్‌లో షాపింగ్ చేయడానికి కాస్త టైమ్ ఇస్తారు.
  • సాలార్‌జంగ్ మ్యూజియం విజిట్​ చేసిన తర్వాత లంచ్​ బ్రేక్​ ఉంటుంది.
  • మధ్యాహ్నం భోజనం తర్వాత నిజాం మ్యూజియం వెళ్తారు. అనంతరం గోల్కొండ కోటను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు.
  • ఆ తర్వాత కుతుబ్ షాహీ టూంబ్స్​ విజిట్​ చేస్తారు. అనంతరం ఐమ్యాక్స్(ఖైరతాబాద్) మీదుగా చివరగా లుంబినీ పార్క్ దగ్గర రాత్రి 7:30 గంటలకు వదిలేస్తారు. దీంతో మీ వన్ డే ట్రిప్ పూర్తవుతుంది.

శుక్రవారం వెళ్తే వీటిని చూడలేరు:ఈ వన్ డే ట్రిప్‌ ప్రతిరోజూ ఉంటుంది. కానీ శుక్రవారం రోజున వెళ్తే నగరంలోని అన్ని మ్యూజియమ్స్‌ను చూడలేరు. ఎందుకంటే ఆరోజున చౌమహాల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం మూసి ఉంటాయి. అయితే ఈ శుక్రవారం రోజున మ్యూజియమ్స్​కు బదులు నెహ్రూ జూ లాజికల్ పార్కును సందర్శించొచ్చు.

ధరలు: హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్‌లో భాగంగా ఏసీ, నాన్ ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏసీ బస్సులో పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 చెల్లించాలి. అదే నాన్​ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.380, చిన్న పిల్లలకు రూ.300 చెల్లించాలి. అయితే ఫుడ్​, సందర్శన స్థలాల వద్ద ఎంట్రీ టికెట్లు పర్యాటకులే చూసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఒకే ట్రిప్​లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్​, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!

తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీ - ఒకేరోజు పంచారామాల దర్శనం - ధర కూడా తక్కువే!

ABOUT THE AUTHOR

...view details