ETV Bharat / offbeat

ఆరోగ్యానికి మేలు చేసే "బీట్​రూట్ పూరీలు" - నూనె తక్కువ పీల్చుతాయి! - టేస్ట్ అదుర్స్! - BEETROOT POORI RECIPE

రెగ్యులర్ పూరీని మించిన టేస్ట్ - నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు!

Poori Recipe
Beetroot Poori Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2025, 4:56 PM IST

Beetroot Poori Recipe in Telugu : బీట్​రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, కొంతమంది బీట్​రూట్ నేరుగా తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. జ్యూస్ తాగడాన్ని కూడా ఇష్టపడరు. అలాంటి వారికోసం ఒక సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, "బీట్​రూట్ పూరీ". ఎప్పుడూ ఒకే రకమైన టిఫెన్ తిని బోర్ కొట్టిన వారికి ఇది సరికొత్త రుచిని అందిస్తుంది.

అంతేకాదు, ఈ విధంగా పూరీలు చేసి పెట్టారంటే ఇష్టంలేని వాళ్లూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈ పూరీలు తక్కువ ఆయిల్​ని పీల్చుకుంటాయి. దీనిని తినడం వల్ల రుచితో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు సొంతం అవుతాయి! పైగా వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ బీట్​రూట్ పూరీలకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమపిండి - 2 కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • రవ్వ - 1 టేబుల్​స్పూన్
  • బీట్​రూట్ - 1
  • కారం - అర చెంచా
  • ధనియాల పొడి - అర చెంచా
  • నూనె - వేయించడానికి సరిపడా

ఎప్పుడూ ఫ్రెంచ్​ ఫ్రైస్​ బోర్​ - వెరైటీగా "బీట్​రూట్​ ఫ్రైస్"​ చేయండి - మళ్లీ మళ్లీ కావాలంటారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బీట్​రూట్​ని శుభ్రంగా కడిగి, పొట్టు తీసుకోవాలి. ఆపై దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై ఒక గిన్నెలో బీట్​రూట్ ముక్కలు వేసి తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి.
  • అనంతరం ఉడికించుకున్న బీట్​రూట్ ముక్కలు చల్లారాక మిక్సీ జార్​లో వేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని గోధుమపిండి, రవ్వ, మిక్సీ పట్టుకున్న బీట్​రూట్ పేస్టు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొన్ని నీళ్లు, కారం, ధనియాల పొడి, ఉప్పు యాడ్ చేసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. ఆపై చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • అనంతరం చపాతీ పీటపై ఒక్కో ఉండను ఉంచి పూరీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని రెండువైపులా చక్కగా కాలేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ప్లేట్​లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "బీట్​రూట్ పూరీలు" రెడీ!
  • వీటిని కొబ్బరి, పల్లీల చట్నీ, పప్పు, రైతా, ఇంకేదైనా కర్రీతో తిన్నా చాలా రుచికరంగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా బీట్​రూట్ పూరీలు ట్రై చేయండి.

నూనె లేకుండానే పూరీలు పొంగుతాయి! - హెల్దీ టిఫెన్​ ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.