Telangana Tourism Arunachalam Package:అరుణాచలం.. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది . దీన్నే తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అరుణాచ గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని, కోరిక కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఈనెలలో పౌర్ణమి నవంబర్ 15వ తేదీన వచ్చింది. అందులోనూ కార్తికమాసం కావడంతో అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. మరి మీ కూడా కార్తిక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా? మీకోసం సూపర్ ప్యాకేజీ తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ టూరిజం హైదరాబాద్ - అరుణాచలం పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ సాగుతుంది. ఇది 3 రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. ఈ నవంబర్ నెలలో 13వ తేదీన జర్నీ ఉంది. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్లోని బషీర్ బాగ్ నుంచి బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ రాత్రి మొత్తం టూర్ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడ TTDC ఆలయం హోటల్లో చెకిన్ అవుతారు. లంచ్ తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
- మూడో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. లంచ్ తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్ను దర్శించుకుంటారు. దర్శనం అనంతరం రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- నాలుగో రోజు ఉదయం హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ టూర్ పూర్తవుతుంది.