Teachers Day 2024 Wishes and Quotes : ఓ వ్యక్తి జీవితంలో స్థిరపడేందుకు ముగ్గురు వ్యకులు సహాయపడతారు. వారిలో మొదటి ఇద్దరూ తల్లిదండ్రులైతే.. మూడవ వ్యక్తి గురువు. చిన్నతనంలో అక్షరాలు దిద్దించి విద్యకు పునాదులు వేయడంతో పాటు, తన జీవితంలోని అనుభవ పాఠాలను భోధించి.. సమాజంలో గౌరవంగా ఎలా జీవించాలో నేర్పించేవారు ఉపాధ్యాయులు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా 'ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day)' జరుపుకుంటాం. ఈ క్రమంలోనే చాలా మంది తమ గురువులకు విషెస్ చెప్పడం, గిఫ్ట్లు ఇవ్వడం చేస్తుంటారు. మరి మీరు కూడా మీకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు టీచర్స్ డే రోజు స్పెషల్గా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ కోసం "ఈటీవీ భారత్" ప్రత్యేకంగా అందిస్తున్న స్పెషల్ విషెస్, కోట్స్ ఒకసారి చూసేయండి..!
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 2024 :
Teachers Day 2024 Wishes:
"మీ మార్గనిర్దేశం, మీరందించిన జ్ఞానం నా జీవిత ప్రయాణంలో వెలుగు నింపాయి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు సర్"- హ్యాపీ టీచర్స్ డే
"కేవలం పాఠ్య పుస్తకాలలో ఉన్న పాఠాలే కాకుండా.. మీ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో క్లిష్టమైన అనుభవ పాఠాలను చిన్నప్పుడే నేర్పించారు. వాటి ద్వారా నా జీవితానికి బాటలు వేసుకున్నాను మాస్టారు."- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
"ప్రపంచానికి, మీరు కేవలం ఉపాధ్యాయులు కావచ్చు. కానీ మీరు నాకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి." -ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
"నా లోని భయం, లోపాలన్నింటినీ సరిదిద్ది.. జీవితంలో స్థిరపడేలా అన్ని విధాలా కృషి చేసిన మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సర్." -హ్యాపీ టీచర్స్ డే
"ఎందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది..
తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ..
ఆనందపడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో..
తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టే గురువులందరికీ.." - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
"గురు బ్రహ్మ, గురు విష్ణు గురదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మా శ్రీ గురవే నమః" -హ్యాపీ టీచర్స్ డే సర్