ETV Bharat / offbeat

న్యూ ఇయర్​ స్పెషల్​ ​నాన్​వెజ్ థాలీ "మటన్​ బిర్యానీ, చికెన్​ తవా, ఫిష్​ ఫ్రై" చేసేయండిలా - రుచితో పాటు పార్టీ అదుర్స్​! - NON VEG THALI IN TELUGU

- డిసెంబర్​ 31 ఎప్పుడూ గుర్తుండిపోయేలా ? -సరికొత్త పద్ధతిలో నాన్​వెజ్​ రెసిపీలు ట్రై చేయండిలా!

New Year Special Non Veg Thali
New Year Special Non Veg Thali (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 3:39 PM IST

New Year Special Non Veg Thali : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​ కోసం అప్పుడే అందరూ ప్లాన్స్​ చేసేస్తున్నారు. ఇక నాన్​వెజ్​ లవర్స్​కి ఆ రోజంతా పండగే అని చెప్పుకోవచ్చు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి న్యూ ఇయర్​ సందర్భంగా మటన్​ బిర్యానీ, తవా చికెన్​, ఫిష్​ ఫ్రై చేసేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. పార్టీ కూడా అదుర్స్​ అనిపిస్తుంది. మరి సింపుల్​గా ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

చికెన్​ తవాకి కావాల్సిన పదార్థాలు :

  • చికెన్‌ లెగ్స్‌- నాలుగు
  • చికెన్​ పెద్ద ముక్కలు-2
  • ఉప్పు-తగినంత
  • ఎండుమిర్చి-12
  • వెల్లుల్లిరెబ్బలు -12 (పొట్టుతీసినవి)
  • చిన్న అల్లం ముక్క
  • అనాసపువ్వు-1
  • యాలకలు-4
  • దాల్చినచెక్క-రెండు చిన్నవి
  • రాతిపువ్వు-కొద్దిగా
  • మిరియాలు-15
  • నూనె-2 టేబుల్​స్పూన్లు
  • పసుపు-చిటికెడు
  • జీలకర్ర- అరటీస్పూన్
  • నిమ్మకాయ రసం -2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా చికెన్‌ లెగ్స్‌, ముక్కలను శుభ్రంగా కడిగి గాట్లు పెట్టాలి.
  • ఆపై ఒక మిక్సీ జార్లోకి మసాలాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలు, ఉప్పు, పసుపు అన్నింటినీ వేసుకోవాలి. అలాగే నూనె, నిమ్మరసం పిండి మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు మసాలా మిశ్రమాన్ని గాట్లు పెట్టిన చికెన్​కి పట్టేలా బాగా కలుపుకోవాలి. వీలైతే ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిడ్జ్​లో పెట్టాలి. లేదంటే ఒక గంటపాటు ఫ్రిడ్జ్​లో పెట్టుకోవచ్చు.
  • అనంతరం స్టౌపై ఒక పెనం పెట్టండి. తర్వాత ఒక రెండు టేబుల్​స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఆపై మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ ముక్కలు వేసి మూతపెట్టి కదపకుండా 4 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు చికెన్​ ముక్కలు మరోవైపు టర్న్​ చేసి కాల్చుకోండి.
  • చికెన్ ముక్కలు ఉడికి​ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ తవా చికెన్​ రెడీ!

నోరూరించే ఫిష్​ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు :

  • బోన్​లెస్ ఫిష్​ ముక్కలు-అరకేజీ
  • ఉప్పు-తగినంత
  • కారం-ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • పసుపు-పావుటీస్పూన్​
  • మిరియాలపొడి-అరటీస్పూన్
  • ఆవాలు -3 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి-2
  • అల్లం ముక్కలు-2
  • వెల్లుల్లి రెబ్బలు-4 (పొట్టుతీసినవి)
  • కార్న్​ఫ్లోర్​-2 టేబుల్​స్పూన్లు
  • మైదా-టేబుల్​స్పూన్
  • నిమ్మరసం-టేబుల్​స్పూన్

తయారీ విధానం :

  • ముందుగా బోన్​లెస్ ఫిష్​ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆవాలను 15 నిమిషాలు నీటిలో నానబెట్టాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఆవాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్​ బౌల్లోకి ఫిష్​ ముక్కలు తీసుకోండి. ఇందులో ఉప్పు, పసుపు, మిరియాలపొడి, కారం, గ్రైండ్ చేసుకున్న ఆవాల పేస్ట్​ వేసి బాగా కలుపుకోవాలి.
  • వీలైతే ఈ ఫిష్​ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిడ్జ్​లో ఉంచుకోవాలి. లేదంటే అరగంట పాటు ఫ్రిడ్జ్​లో పెట్టాలి.
  • అనంతరం ఫ్రిడ్జ్​లో పెట్టుకున్న ఫిష్​ని తీసి ఇందులో కార్న్​ఫ్లోర్​, మైదా, నిమ్మరసం వేసి బాగా కలపండి.
  • చేప ముక్కలకు పిండి బాగా పట్టేలా కలపండి.
  • ఇప్పుడు చేప​ ఫ్రై కోసం స్టౌపై పాన్​ పెట్టి సరిపడా నూనె పోయండి.
  • ఆ తర్వాత ఒక్కో చేప ముక్కను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి.
  • ఫిష్​ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అంతే ఇలా సులభంగా చేసుకుంటే నోరూరించే ఫిష్​ ఫ్రై రెడీ.

మటన్​ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :

  • మటన్ - అరకిలో
  • బాస్మతి బియ్యం- అరకిలో
  • నూనె - పావు కప్పు
  • నెయ్యి - పావు కప్పు
  • దాల్చిన చెక్క - 3 అంగుళాలు
  • అనాస పువ్వులు - 2
  • యాలకులు - 7
  • లవంగాలు - 12
  • షాజీరా - 1 టేబుల్​స్పూన్
  • బిర్యానీ ఆకులు - 4
  • రాతి పువ్వు - 1
  • ఉల్లిపాయ తరుగు - కప్పు
  • పచ్చిమిర్చి-4
  • మటన్​ కొవ్వు -50 గ్రాములు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • జాజికాయ పొడి- 2 చిటికెలు
  • పెరుగు - అర కప్పు
  • పాలు - అర కప్పు
  • టమాటాలు - 2
  • కారం - రుచికి తగినంత
  • పసుపు-పావుటీస్పూన్​
  • వేపిన జీలకర్ర పొడి-టీస్పూన్​
  • ధనియాల పొడి - టీస్పూన్​
  • గరంమసాలా - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - పిడికెడు
  • పుదీనా తరుగు - పిడికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నిమ్మకాయ-1

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. అలాగే మటన్​ని శుభ్రంగా కడిగి వాటర్​ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా రెసిపీలోకి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్​ చేసుకొని పక్కనుంచాలి.
  • మటన్ బిర్యానీ కోసం స్టౌపై అడుగు మందంగా ఉండే బిర్యానీ హండీ పెట్టండి. ఇందులో నూనె, నెయ్యి వేసి కరిగించండి.
  • ఆపై అందులో దాల్చిన చెక్క, అనాస పువ్వులు, యాలకులు, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకులు, రాతి పువ్వు వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.
  • ఆనియన్స్​ గోల్డెన్​ బ్రౌన్​ కలర్లో వేగిన తర్వాత మటన్​ కొవ్వు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు​ వేసి కలిపి కాసేపు వేయించుకోవాలి.
  • అనంతరం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్​ వేసి మిక్స్​ చేసుకోవాలి.
  • అలాగే జాజికాయ పొడి వేసి కలపండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి వేపండి.
  • అనంతరం హండీపై మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ 25 నిమిషాలు ఉడికించుకోండి.
  • ఆపై పెరుగు, కారం, పసుపు, వేపిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కలపండి.
  • ఇప్పుడు లీటర్​ వేడివేడి నీళ్లు పోసుకోండి. స్టౌ హై ఫ్లేమ్​లో ఉంచి ఎసరు 5 నిమిషాలు మరిగించుకోండి.
  • అనంతరం పాలు పోసుకోండి.
  • అలాగే నిమ్మకాయ రసం కూడా పిండుకోండి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న రైస్​ వేసుకుని కలుపుకోండి.
  • దీనిని 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్​ మీద, 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్​ మీద మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోండి.
  • ఆ తర్వాత బిర్యానీలోకి కాస్త కొత్తిమీర తరుగు, నెయ్యి వేసి కలపండి.
  • తర్వాత మూతపెట్టి స్టౌ ఆఫ్​ చేసి అరగంటపాటు అలా వదిలేయండి.
  • వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఘుమఘుమలాడే మటన్​ బిర్యానీ, టేస్టీ తవా చికెన్​ ఫ్రై, నోరూరించే ఫిష్​ ఫ్రై మీ ముందుంటాయి.
  • ఈ రెసిపీలు నచ్చితే న్యూ ఇయర్​కి ట్రై చేయండి.

సండే స్పెషల్​: అద్దిరిపోయే "బటర్​ నాన్​ విత్​ చికెన్​ కర్రీ" - ఇలా ప్రిపేర్​ చేస్తే రెస్టారెంట్​ టేస్ట్​ పక్కా!

ఈ స్టైల్​లో "మటన్ దమ్ బిర్యానీ" చేయండి - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.