Rohit Sharma Thank You Post : న్యూ ఇయర్ సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. "ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాం. ప్రతి ఒక్కదానితో మేము అనుభవం సాధించాం. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాం. థ్యాంక్యూ 2024" అంటూ ఓ స్పెషల్ క్యాప్షన్ జోడించాడు. ఇక ఆ వీడియోలో భారత్ టీ20 ప్రపంచకప్ నెగ్గడం, రెండోసారి తండ్రి కావడం, జన్మదిన వేడుకలు, షూటింగ్స్‌కు సంబంధించిన మూమెంట్స్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అయితే రోహిత్ ఇలా ఎమోషనల్‌గా పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తను రిటైర్మెంట్ ఏమైనా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడా అని అనుకుంటున్నారు. ప్లీజ్ అలా చేయొద్దు అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
సిడ్నీలో విరాట్ చక్కర్లు!
ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో విహరించారు. ఆ సమయంలో పలువురు అభిమానుల కెమెరా కంటికి చిక్కారు ఈ జంట. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ప్రస్తుతం భారత్ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియా ఆసీస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ నుంచి అనుష్కతో కలిసి విరాట్ సిడ్నీకి వచ్చేశాడు. కొత్త సంవత్సరాన్ని తన ఫ్యామిలీతో ప్రారంభించాడ. ఆ ఇద్దరూ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరిశారు. అయితే అందులో విరాట్ - అనుష్కతో పాటు యంగ్ ప్లేయర్స్ దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నారు.
Virat Kohli, Anushka Sharma and Devdutt Padikkal & Prasidh Krishna at the Sydney for New Year's celebrations. ❤️👌pic.twitter.com/FC8ahlCVan
— Tanuj Singh (@ImTanujSingh) December 31, 2024
ఇక వీరితో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. తమ ఫ్యామిలీతో గడిపిన స్పెషల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇవి చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్స్‌కు కామెంట్ల రూపంలో న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు.
వెల్కమ్ 2025 : కొత్త ఏడాదిలో అలరించనున్న క్రీడా ఈవెంట్లు ఇవే!
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన - కెప్టెన్‌గా బుమ్రా! - టెస్ట్ టీమ్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్!