ETV Bharat / state

'సబల గుడ్​నెస్​ ఆఫ్​ మిల్లెట్స్'​ ప్రదర్శనకు విశేష స్పందన - న్యూ ఇయర్​ వేడుకలకు హాజరైన మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ - SABALA MILLETS STALL

మణికొండ ల్యాంకోహిల్స్​లో నిర్వహించిన అబల మిల్లెట్స్​ ఎగ్జిబిషన్ - ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ - న్యూ ఇయర్​ సందర్భంగా నిర్వహించిన వేడుకలు

Sabala Millets Exhibition at Manikonda
Sabala Millets Exhibition at Manikonda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 11:13 AM IST

Updated : Jan 1, 2025, 11:29 AM IST

Sabala Millets Exhibition at Manikonda : చిన్న వయసు నుంచే డబ్బును పొదుపు చేయడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను అవలీలగా దాటొచ్చని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. హైదరాబాద్ మణికొండలోని ల్యాంకోహిల్స్​లో రామోజీ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ల్యాంకోహిల్స్​ వాసులు పాల్గొన్నారు. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు ఘనస్వాగతం పలికారు. హుషారైన సంగీతం ఆకట్టుకోగా అందుకు తగ్గట్టుగా చిన్నాపెద్దా నృత్యాలు చేస్తూ అలరించారు. సినీనటులు శివబాలాజీ దంపతులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా రామోజీ గ్రూప్స్ ఆధ్వర్యంలో జరిగిన సబల గుడ్నెస్ ఆఫ్ మిల్లెట్స్ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు విశేష స్పందన లభించింది. సబల మిల్లెట్స్‌ స్టాల్‌ను శైలజాకిరణ్ సందర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో 121 బ్రాంచిలతో 60లక్షల మందికి సేవలు అందించినట్లు శైలజాకిరణ్‌ తెలిపారు. ఈ ఏడాది రూ.14వేల కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

"1962లో రామోజీరావు గారి చేతుల మీదుగా మార్గదర్శి ప్రారంభమైందని మీ అందరికీ తెలుసు. పద్ధతులు, విలువలను పాటిస్తూ సంస్థను నడిపారు. అందువల్లే మార్గదర్శి ఆర్థిక స్థిరత్వంతో నిలబడింది. నీతి, నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనం వల్లే ఇదంతా సాధ్యమైంది. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మార్గదర్శి అనేక మందికి ఇంటి పేరుగా మారింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ విస్తరించాం. చిన్నప్పటి నుంచే పొదుపు చేయాలని నా సలహా. వయసు పైబడినప్పుడు పెద్ద ఖర్చులు ఎదురై చాలా ఆలస్యమవుతుంది. అందరూ 2025లో మార్గదర్శిలో చేరుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజలకు నాణ్యమైన మిల్లెట్స్‌ ను అందించడమే రామోజీరావుగారి చివరి కోరిక." - శైలజాకిరణ్​, మార్గదర్శి ఎండీ

ఇవి ట్రై చేయండి : మిల్లెట్ నూడిల్స్, ప్రొటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, వన్ పాట్ మిల్లెట్ మీల్ మిక్స్, ప్రొటీన్ మీల్ బార్, ప్రొటీన్ డేట్ అండ్ అల్మండ్ బార్, మిల్లెట్ పఫ్స్, మిల్లెట్ జాగరీ కుకీస్, బేక్​డ్​ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరు ధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి. పొంగల్, సాంబార్ మీల్, ఉప్మా, కేసర్ బాదం మీల్, మూంగ్ కిచిడీ, మసాలా కిచిడీ, చక్కర పొంగల్, రాజస్థానీ మూంగ్ దాల్, తమిళనాడు సక్కరాయి పొంగల్, తమిళనాడు పొంగల్, గుజరాతీ వెంఘరేలి కిచిడీ, బెంగాళీ షోగర్ కిచిడీ, కర్ణాటక బిస్మల్లాబాత్, మిల్లెట్ మొరింగా, మిల్లెట్ కోకా, మిల్లెట్ ఓట్స్‌ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ల్యాంకో హిల్స్‌లో సబల మిల్లెట్స్​ ఎగ్జిబిషన్​ - నోరూరించే రుచులకు జనం ఫిదా

ప్రియాఫుడ్స్ నుంచి 'భారత్‌ కా సూపర్‌ఫుడ్‌' - 45 రకాల చిరుధాన్యాలతో మార్కెట్లోకి 'సబల మిల్లెట్స్​'

Last Updated : Jan 1, 2025, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.