తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మార్కెట్లో "కల్తీ టీ పొడి" హల్​చల్​ - మీరు వాడేది స్వచ్ఛమైనదేనా? ఇలా గుర్తించండి!

- కొబ్చరిపీచు, పంచదార పాకంతో టీ పొడి తయారీ -కల్తీ టీ పొడితో అనారోగ్యం

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Tea Powder
Tea Powder Quality Check (ETV Bharat)

Tea Powder Quality Checking Tips :మనలో చాలా మందికి ఉదయాన్నే కప్పు టీ తాగకపోతే ఆ రోజు ప్రారంభం కాదు. కాస్త తలనొప్పిగా ఉన్నా, అలసటగా అనిపించినా కప్పు చాయ్ తాగితే అంతా సెట్​ అవుతుందంటారు ఎక్కువ మంది జనాలు. అంతలా చాయ్ మన రోజువారి జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, ఇటీవల కాలంలో కొంత మంది డబ్బు ఈజీగా సంపాదించాలనే అత్యాశతో మార్కెట్లో నకిలీ చాయ్‌పత్త (టీ పౌడర్‌) విక్రయిస్తున్నారు. కొబ్బరి పీచు, పంచదార పాకంతో కల్తీ టీ పొడి తయారు చేసి అమ్ముతున్నారు. ఇలాంటి టీ పౌడర్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. మీరు ఇంట్లో వాడే టీ పౌడర్​ అసలైందో లేదా నకిలీదో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

నీళ్లలో..ఫేక్​ టీ పౌడర్​ని గుర్తించడానికి ముందుగా ఒక గ్లాసు నీటిలో టేబుల్​స్పూన్​ టీ పౌడర్​ కలపండి. నకిలీ టీ పొడి అయితే, నీళ్లు త్వరగా రంగు మారతాయి. అలాగే టీ పొడి ముద్దముద్దగా మారుతుంది. అయితే, స్వచ్ఛమైన టీ పొడి వాటర్​లో వేస్తే నీళ్లు త్వరగా రంగు మారవు. అలాగే పౌడర్​ నీటి అడుగు భాగాన చేరుతుంది.

స్మెల్​ చూడండి..​సాధారణంగా స్వచ్ఛమైన టీ పొడి నుంచి ఒకరకమైనటువంటి గుడ్ స్మెల్​ వస్తుంది. అలా కాకుండా టీ పౌడర్​ నుంచి కాస్త దుర్వాసన వస్తుంటే అది.. స్వచ్ఛమైనది కాదని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే, టీ పౌడర్​ వాసన మరీ ఘాటుగా వస్తుంటే కూడా.. దానిని ఉపయోగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

టిష్యూ పేపర్‌తో..టిష్యూ పేపర్‌తో కూడా నకిలీ టీ పొడిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక టిష్యూ పేపర్​పై రెండు స్పూన్ల టీ పొడి వేయండి. తర్వాత టీ పొడిపై కొన్ని చుక్కల వాటర్​ పోసి.. టిష్యూ పేపర్​ని ఎండలో ఉంచండి. కొద్దిసేపటి తర్వాత టీ పొడిని తీసేయండి. టిష్యూ పేపర్​పై మరకలు ఏర్పడితే.. అది నకిలీ అని అర్థం. ఈ విధంగా టిష్యూ పేపర్​తో నకిలీ టీ పొడిని గుర్తించవచ్చు.

ఇవీ ముఖ్యమే:మీరు టీ పొడిని కొనేటప్పుడు సీల్ చేసి అమ్మే.. బ్రాండెడ్ టీ పొడులను కొనుగోలు చేయండి. ఎందుకంటే.. బయట లూజుగా అమ్మే టీ పొడులు ఎక్కువగా కల్తీ అయ్యే ఛాన్స్ ఉంటుందట. కాబట్టి, కాస్త ధర ఎక్కువైనా నాణ్యమైన, బ్రాండెడ్ సంస్థలకు చెందిన వాటిని కొనుక్కోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

మీరు వాడే "టీ పొడి" స్వచ్ఛమైనదా? కల్తీదా? - ఈ టిప్స్​తో నిమిషాల్లో కనిపెట్టండి!

బీకేర్​ఫుల్​ - సిమెంట్​తో వెల్లుల్లి: మీరు వాడుతున్న వెల్లుల్లి మంచిదో? కాదో? - ఇలా సింపుల్​గా కనిపెట్టండి!

ABOUT THE AUTHOR

...view details