తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దీపావళి స్పెషల్​ - నోరూరించే "పనీర్​ జిలేబీ"- తింటే అమృతమే! - HOW TO MAKE JUICY PANEER JALEBI

-రెగ్యులర్​ జిలేబీని మించిన టేస్ట్​ -ఈ పద్ధతిలో చేస్తే వెరీ ఈజీ

Paneer Jalebi
How to Make Paneer Jalebi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 4:12 PM IST

How to Make Paneer Jalebi:మరికొన్ని రోజుల్లో దీపావళి రానుంది. ఈ క్రమంలో చాలా మంది స్వీట్స్​ చేస్తుంటారు. అయితే స్వీట్స్​లలో ఎక్కువ మంది జిలేబీ చేస్తుంటారు. ఇక జీలేబీ అంటే మినపప్పు, మైదాతో చేస్తుంటారని తెలుసు. కానీ పనీర్​తో కూడా జిలేబీ చేసుకోవచ్చు. ఏంటీ పనీర్​తో కూరలు చేసుకోవచ్చని తెలుసు కానీ.. జిలేబీ కూడా చేసుకోవచ్చా? అని మీకు డౌట్​ రావచ్చు. కానీ పనీర్​తో కూడా అద్దిరిపోయే జిలేబీ ప్రిపర్​ చేసుకోవచ్చు. పైగా దీని టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి మీరూ ఈ దీపావళికి జిలేబీ చేయాలనుకుంటే.. ఓసారి పనీర్​తో ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • చిక్కటి పాలు - లీటరున్నర
  • నీళ్లు - పావు కప్పు
  • వెనిగర్​- పావు కప్పు
  • పంచదార - 2 కప్పులు
  • నీరు - అర కప్పు
  • ఆరెంజ్​ ఫుడ్​ కలర్​ - చిటికెడు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్​
  • మైదా - 2 టేబుల్​ స్పూన్లు
  • కార్న్​ఫ్లోర్ - 2 టేబుల్​ స్పూన్లు
  • బేకింగ్​ సోడా - చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా నీళ్లు, వెనిగర్​ సమపాళ్లలో కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి చిక్కటి పాలు పోసుకోవాలి. హై ఫ్లేమ్​లో పెట్టి గరిటెతో కలుపుతూ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి.
  • పాలు ఒక పొంగు వచ్చినప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి దింపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందే కలిపి పెట్టుకున్న వెనిగర్​ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా వెనిగర్​ పోస్తే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు సెపరేట్​ అవుతాయి. అప్పుడు ఓ 5 నిమిషాలు వదిలేయాలి.
  • ఆ తర్వాత విరిగిన పాల మిశ్రమాన్ని ఓ తెల్లటి కాటన్​ క్లాత్​లోకి తీసుకుని దానిని జల్లెడలో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి చల్లటి నీళ్లు పోసుకుంటూ పనీర్​ను ఆ క్లాత్​లోనే కడగాలి.
  • కడిగిన పనీర్​ను గట్టిగా పిండాలి. అయితే అప్పటికీ అందులో కొద్దిగా నీరు అనేది ఉంటుంది. కాబట్టి పూర్తి నీరు పోయేందుకు పనీర్​ మిశ్రమం ఉన్న క్లాత్​ను ఓ 20 నిమిషాలు వేలాడదీయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న నీరు పూర్తిగా తొలగిపోతాయి.
  • ఈలోపు పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పంచదార పోసుకోవాలి. అందులోకి అరకప్పు నీళ్లు పోసుకుని పంచదారను కలుపుకోవాలి.
  • పంచదార కరిగి ఆముదం లాంటి జిగురు వచ్చే వరకు కలుపుతూ మరిగించాలి.
  • అనుకున్న పాకం వచ్చిన తర్వాత అందులోకి ఫుడ్​ కలర్​, యాలకుల పొడి వేసి కలిపి దించేసి పక్కకు పెట్టాలి.
  • ఇప్పుడు పనీర్​ ముద్దను ఓ ప్లేట్​లోకి తీసుకుని చేతి మణికట్టు సాయంతో ఓ నాలుగు నిమిషాలు బాగా నలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి మైదా, కార్న్​ఫ్లోర్​ వేసి పనీర్​లో బాగా కలిసేలా ఒత్తుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నెలోకి బేకింగ్​ పౌడర్​, టీస్పూన్​ నీళ్లు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనీర్​లో పోసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్​స్పూన్ల నీళ్లు పోసి పేస్ట్​లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్​ కాస్త చిక్కగానే ఉండాలి.
  • ఇప్పుడు పైపింగ్​ బ్యాగ్​సో నాజిల్​ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పైపింగ్​ బ్యాగ్​లోకి పనీర్​ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని క్లోజ్​ చేసి నాజిల్​ ఉన్న సైడ్​ పైపింగ్​ బ్యాగ్​ చివర కట్​ చేయాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత పైపింగ్​ బ్యాగ్​ సాయంతో పనీర్​ మిశ్రమాన్ని నూనెలోకి జిలేబీలుగా ఒత్తుకోవాలి.
  • ఇలా చేసిన జిలేబీలను రెండు వైపులా ఎర్రగా కాల్చి.. ముందే ప్రిపేర్​ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఓ ముప్పై సెకన్ల తర్వాత తీసి సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనీర్​ జిలేబీ రెడీ!!

ABOUT THE AUTHOR

...view details