Sweet Potato Gulab Jamun Recipe : మనలో చాలా మందికి ఇష్టమైన స్వీట్లలో గులాబ్ జామున్ కూడా ఒకటి. గులాబ్ జామున్ కప్పులో కాస్త ఐస్‌క్రీమ్ వేసుకుని తింటే.. టేస్ట్ అమృతంలా ఉంటుంది! అయితే, ఇంట్లో గులాబ్ జామున్ చేయాలంటే కోవా వంటి రకరకాల పదార్థాలు ఉండాలని చాలా మంది ఈ స్వీట్ట్రై చేయకుండా ఉంటారు.
అయితే.. ఇవేవీ లేకుండానే కమ్మటి గులాబ్ జామున్చేయొచ్చని మీకు తెలుసా ? అవునండీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిలగడదుంపలతోనూ టేస్టీ గులాబ్ జామున్ ప్రిపేర్ చేయవచ్చు. ఇది చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా "కమ్మని చిలగడదుంప గులాబ్ జామున్" ఎలా చేయాలో ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- చిలగడ దుంప-250 గ్రాములు
- మిల్క్ పౌడర్-3 టేబుల్‌స్పూన్లు
- మైదాపిండి-2 టేబుల్‌స్పూన్లు
పాకం కోసం..
- షుగర్-కప్పు
- నీళ్లు-కప్పు
- యాలకుల పొడి-అరటీస్పూన్
తయారీ విధానం:
- ముందుగా పాకం కోసం.. స్టౌపై ఒక గిన్నె పెట్టండి. ఇందులో పంచదార, నీళ్లు పోసి వేడి చేయండి.
- పాకం చిక్కగా మారిన తర్వాత యాలకుల పొడి వేసి 2 నిమిషాలు మరిగించండి.
- పాకం.. గులాబ్ జామున్ సిరప్‌లా తయారయ్యాక స్టౌ ఆఫ్ చేయండి.
- ఇప్పుడు చిలగడదుంపలను శుభ్రంగా కడగండి. తర్వాత చిలగడ దుంపలను ఆవిరికి ఉడికించుకోండి. (వీటిని నీటిలో ఉడికించుకుంటే.. గులాబ్ జామున్లు చేయడం రాదు)
- చిలగడదుంపలు చల్లారిన తర్వాత.. వాటిపైన ఉన్న పొట్టు తీసేసుకోండి. అలాగే నార లేకుండా పూర్తిగా కేవలం గుజ్జును మాత్రమే తీసుకోండి.
- తర్వాత చిలగడ దుంప మిశ్రమాన్ని చేతితో మెదుపుకోండి. (మిశ్రమంలో ఉండలు లేకుండా సాఫ్ట్‌గా ఉండాలి)
- ఇందులో మైదాపిండి, మిల్క్‌పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే కొద్దిగా వంటసోడా వేసి కలపండి.
- తర్వాత కొద్దిగా నెయ్యి పోసి మిశ్రమాన్ని కలుపుకోండి.
- ఆపై గులాబ్ జామున్ల మాదిరిగా చిన్నచిన్న ఉండలు చేసి ప్లేట్లో పెట్టుకోండి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయండి.
- నూనె వేడయ్యక స్టౌ మీడియంలో ఫ్లేమ్‌లో ఉంచుకుని గులాబ్ జామున్ బాల్స్ ఒక్కోటిగా వేయండి.
- ఒక నిమిషం తర్వాత గరిటెతో తిప్పి గులాబ్ జామున్లను బాగా ఫ్రై చేసుకోండి.
- రెండువైపుల చక్కగా రంగు మారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నపాకంలో వేసి.. అరగంటపాటు అలా వదిలేయండి.
- తర్వాత ఈ గులాబ్ జామున్లు తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటాయి.
- నచ్చితే మీరు కూడా ఈ ఇలా హెల్దీగా గులాబ్ జామున్లు ఓసారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోయిందా? - ఇలా "కాలా జామూన్" చేసుకోండి- నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!
దీపావళి వేళ ఈ వెరైటీ బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా? - చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం!