Stainless Steel Sink Cleaning Tips :కిచెన్లోమహిళలు ఎక్కువ సమయం పని చేసేది సింక్ దగ్గరే. వంట కోసం పాత్రలు కడగడం నుంచి మొదలు కూరగాయల శుభ్రం వరకు వారి అధిక సమయం వంటింట్లోని సింక్దగ్గరే గడిచిపోతుంది. ఈ క్రమంలో ఎన్నిసార్లు శుభ్రం చేసినా సింక్ మురికిగా మారుతుంది. అలాగే కొన్నిసార్లు దుర్వాసన కూడా వస్తుంది. ఇక స్టెయిన్ లెస్ స్టీల్ సింక్లు వాడే వారికి ఈ కష్టాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు.
చాలా మంది స్టెయిన్ లెస్ స్టీల్ సింక్లనుశుభ్రం చేయడానికి కెమికల్స్‌తో కూడిన లిక్విడ్స్, గరుకుగా ఉన్న స్క్రబ్స్‌ని ఉపయోగిస్తారు. కానీ వీటిని వాడడంతో స్టీల్ సింక్ కొద్ది రోజుల్లోనే పాతబడిపోయినట్లు అయిపోతుంది. అలాగే పైన గీతలు కూడా పడుతుంటాయి. అయితే, అలా కాకుండా ఉండాలంటే సింక్‌ని వాడేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి!
మనం డైలీ గిన్నెలు శుభ్రం చేసినప్పుడు, కాయగూరలు కడిగినప్పుడు.. ఎంతో కొంత చెత్త సింక్‌లో కూడా ఉండిపోతుంటుంది. అందుకే సింక్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే సింక్‌లో నీళ్లు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందట.
ఈజీగా ఇలా క్లీన్ చేసేద్దాం
కెమికల్స్‌తో కూడిన లిక్విడ్‌వాష్‌లు, డిటర్జెంట్లు ఉపయోగించి సింక్‌ని క్లీన్ చేయడం వల్ల త్వరగా నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి, సహజసిద్ధంగా తయారుచేసిన పదార్థాలతో క్లీన్ చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మ లేదా నారింజ తొక్కలు, ఆలివ్ నూనె.. మొదలైనవి ఎంతగానో ఉపయోగపడతాయట.
- ముందుగా సింక్‌లో ఎలాంటి చెత్తా లేకుండా శుభ్రం చేసుకోవాలి.
- ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్ సాయంతో సింక్ అంతా వ్యాపించేలా బాగా రుద్దాలి.
- ఆ తర్వాత వెనిగర్‌తో కడగాలి.
- ఆపై నీటితో శుభ్రం చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో మెల్లగా సింక్ మొత్తం రుద్దాలి.
- ఇలా చేయడం వల్ల సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా, తాజాగా ఉండడంతో పాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతూ ఉంటుంది.
- మళ్లీ వాటర్‌తో క్లీన్ చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తని వస్త్రంపై ఆలివ్‌నూనె వేసి సింక్ మొత్తం తుడవాలి.
ఈ టిప్స్ పాటించండి :
- లిక్విడ్ సోప్ లేదా ఇతర హౌస్‌హోల్డ్ క్లీనర్స్‌ను స్టెయిన్లెస్ స్టీల్ సింకును క్లీన్ చేయడానికి ఉపయోగించకూడదు.
- అలాగే సింక్‌లో బ్లీచ్, క్లోరిన్ వంటి పదార్థాలు కూడా ఎక్కువ టైమ్ ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మెరుపు తగ్గే అవకాశం ఉంటుంది.
- కొంతమంది స్టెయిన్లెస్ స్టీల్ సింకును శుభ్రం చేయడానికి స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్స్ వాడుతుంటారు. దీనివల్ల గీతలు పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని సింక్‌లో ఉపయోగించకూడదు.
- సింక్‌లో గిన్నెలు వేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు.. నెమ్మదిగా వర్క్ చేసుకోవాలి. లేదంటే తొందరపాటు వల్ల కూడా వల్ల గీతలు పడచ్చు.
- సింక్ వాడిన ప్రతిసారీ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు హాట్‌వాటర్‌లో మైల్డ్ సోప్ కలిపి వాటితో సింక్‌ని క్లీన్ చేసుకోవాలి.
- సింక్‌ని తరచూ వాడడం వల్ల మచ్చలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. కాబట్టి మెత్తని క్లాత్‌పై కొద్దిగా వైట్ వెనిగర్ వేసి తుడవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే స్మెల్ పరార్!
రాత్రి తిన్న గిన్నెలన్నీ - పొద్దున్నే క్లీన్ చేద్దామని సింక్‌లో వదిలేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?