తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సొరకాయతో కూర, పచ్చడి రొటీన్​ - వెరైటీగా "తపిలెంటు" చేయండి!- టేస్ట్​ అద్దిరిపోతుంది!!

-రొటీన్​ స్నాక్స్​ తిని బోర్ కొట్టిందా? -సింపుల్​గా సొరకాయ తపిలెంటు ట్రై చేయండి

Sorakaya Tapilentu Recipe
Sorakaya Tapilentu Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 12:34 PM IST

Sorakaya Tapilentu Recipe :మనలో చాలా మందికి ఈవెనింగ్​ టైమ్​లో ఏదైనా స్నాక్స్​ తినాలనిపిస్తుంటుంది. దీంతో ఎక్కువ మంది ఇంట్లోనే ఆనియన్​ పకోడి, మిర్చీ బజ్జీ, సమోస చేసుకోవడమో.. లేదా బయట తినడమో చేస్తుంటారు. అయితే, స్నాక్స్​ ఎప్పుడూ ఒకే విధంగా చేస్తే బోర్​ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా సొరకాయ తపిలెంటు ప్రిపేర్​ చేయండి. క్రిస్పీగా కారంగా ఉండే తపిలెంటు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మన అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువగా చేసుకుని తినేవారు. కమ్మగా ఉండే ఈ తపిలెంటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా సొరకాయ తపిలెంటు ఎలా చేయాలి ? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం పిండి-పావు కేజీ
  • సొరకాయ- చిన్నది
  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-4
  • కరివేపాకు-2 రెమ్మలు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • పచ్చిశనగపప్పు-పావుకప్పు
  • జీలకర్ర-టీస్పూన్
  • నూనె సరిపడా
  • కొత్తిమీర

తయారీ విధానం:

  • ముందుగా సొరకాయను శుభ్రం చేసి పైన పొట్టు తీసేసుకోవాలి. ఆపై సన్నగా తురుముకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్​ చేసుకోవాలి.
  • అలాగే పచ్చిశనగపప్పు అరగంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్లోకి సొరకాయ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తురుము, నానబెట్టిన పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి బాగా కలపండి.
  • తర్వాత బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చేతితో మిక్స్​ చేయండి. (అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పిండి కాస్త గట్టిగానే ఉండాలి)
  • ఇప్పుడు ఒక పెనం తీసుకుని ఆయిల్​ రాయండి. తర్వాత కొద్దిగా పిండి తీసుకుని పెనంపై రొట్టె మాదిరిగా చేతితో రెడీ చేసుకోండి.
  • ఆపై పెనం స్టౌపై పెట్టి దోరగా కాల్చుకోండి.
  • తపిలెంటు లోపల కూడా చక్కగా ఉడకడానికి పాన్​పై మూతపెట్టండి. తపిలెంటు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి రంగు మారే వరకు కాల్చుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా మిగిలిన పిండితో చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ తపిలెంటు మీ ముందుంటుంది.
  • నచ్చితే ఈ విధంగా ఈవెనింగ్ స్నాక్​ ఓ సారి ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details