Best Rural Entrepreneur Award : ఒకప్పుడు అతనొక డ్రా పౌట్. మధ్యలో చదువు మానేసి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తగా అవతరించి కొంత మందికి మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డును సైతం అందుకున్నారు. ఆయనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలానికి చెందిన కొడముంజ మహేందర్.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన కొడముంజ మహేందర్ కుటుంబం స్థానికంగా ఉపాధి లేక 30 ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి వలస వెళ్లింది. ఆ సమయంలో మహేందర్ 8వ తరగతి విద్యనభ్యసిస్తున్నారు. చదువు మధ్యలో మానేసి తల్లిదండ్రుల కష్టం చూసి వారితో కలిసి పని చేశారు. కొన్నేళ్ల తర్వాత తిగిరి స్వగ్రామానికి రాగా, ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యారు.
పెద్దపల్లి ఐటీఐలో వెల్డర్ కోర్సు విజయవంతంగా పూర్తి చేశారు. నంగునూరులోని తన బావ వద్ద వెల్డింగ్ కార్మికుడిగా చేరి కొంతకాలం పని చేశారు. ఈ క్రమంలో 2008వ ఏట పవన్ ఇంజినీరింగ్ వర్క్స్ పేరుతో హుస్నాబాద్ టౌన్లో సొంతంగా దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని ఒక పరిశ్రమగా మార్చారు. ఫిజికల్ ఫిట్నెస్ పరికరాల తయారీకి కేఎంఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ నెలకొల్పారు. రూ.10 లక్షల బ్యాంకు లోన్ తీసుకుని హైదరాబాద్ జీడిమెట్లలో మరో బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు.
వ్యవసాయ పరికరాలు : ఆయా పరిశ్రమల్లో జిమ్ పరికరాలతో పాటు వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్ కేజీవీల్స్, కల్టివేటర్లు, రోటవేటర్లు, డోజర్, గొర్రు, ట్రాలీలు, ట్యాంకులూ తయారు చేస్తున్నారు. ఈయన భార్య సరిత సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దీంతో 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈయన కృషిని గుర్తించిన ప్రభుత్వం గ్రామీణ ఉత్తమ పారిశ్రామిక వేత్తగా బిక్కీ అవార్డుతో మహేందర్‌ను సత్కరించింది. హైదరాబాద్‌లోని టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నుంచి అవార్డును మహేందర్ అందుకున్నారు.
ANR అవార్డు అందుకున్న చిరంజీవి- ప్రదానం చేసిన బిగ్ బి
తేజసజ్జాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్- అంతా 'హనుమాన్' వల్లే! - Teja Sajja Hanuman