ETV Bharat / entertainment

రూ.300 కోట్ల రెమ్యునరేషన్​, ఆ సీక్వెన్స్​ కోసం రూ.60 కోట్ల ఖర్చు, - 'పుష్ప 2' గురించి 11 ఆసక్తికర విషయాలివే! - INTERESTING FACTS ABOUT PUSHPA 2

గ్రాండ్​గా పుష్ప 2 రిలీజ్ - అభిమానుల్లో భారీగా పెరిగిపోయిన అంచనాలు.

Pushpa The Rule Interesting Facts
Pushpa The Rule Interesting Facts (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2024, 6:08 PM IST

Pushpa The Rule Interesting Facts : యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోన్న సమయం ఆసన్నమైంది. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప ది రూల్‌' మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వనుంది. దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన 'పుష్ప: ది రైజ్‌'కు సీక్వెల్​గా ఇది వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాతోపాటు షూటింగ్‌ విశేషాలు, నటీనటుల రెమ్యూనరేషన్స్‌ గురించి తెలుసుకునేందుకు సినీప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో 'పుష్ప ది రూల్‌'కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

నాలుగో చిత్రం

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా 'పుష్ప ది రూల్‌'. 2004లో తొలిసారి వీరిద్దరి కాంబోలో 'ఆర్య' విడుదలై భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత 'ఆర్య 2', 'పుష్ప ది రైజ్‌' వచ్చాయి. ఇప్పుడు 'పుష్ప 2' తెరకెక్కింది.

రూ.300కోట్ల రెమ్యూనరేషన్

'పుష్ప ది రూల్‌' సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాలో ఆయన మొదటి స్థానంలో నిలిచారని ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్‌ ఇటీవల వెల్లడించింది.

2 ఏళ్లపాటు షూటింగ్

2022లో పుష్ప సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. అల్లు అర్జున్‌ లుక్‌ టెస్ట్‌ చేసి, సినిమాను ప్రకటించారు. 2023లో రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది. విశాఖపట్నం, బెంగళూరు, ఒడిశా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. 2024 నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు.

రెండు పార్టులుగా పుష్ప

'పుష్ప'ను ఒక సినిమాగానే తీసుకురావాలని మొదట భావించారు. కానీ, సుకుమార్‌ స్క్రిప్ట్‌ ప్రకారం కొంత షూటింగ్‌ అయిన తర్వాత నిర్మాత చెర్రీ వచ్చి సినిమా ఎంతవరకూ వచ్చిందని అడిగారు. అప్పటికే మూడున్నర గంటల ఫుటేజ్‌ రావడంతో ఆయన సూచనమేరకు రెండు పార్టులుగా విడుదల చేద్దామని భావించారు. అప్పటివరకూ తీసిన దాన్ని ఎడిట్‌ చేసి‘ పుష్ప1: ది రైజ్‌ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత పుష్ప2 తో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు.

ఒక్క సీక్వెన్స్ కోసం రూ.60కోట్ల ఖర్చు

'పుష్ప2' గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌ అని టాక్ నడుస్తోంది. ఇందులో బన్నీ మాతంగి వేషంలో కనిపించనున్నారు. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసమే ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 30 రోజులపాటు దీనిని షూట్‌ చేశారట.

రష్మిక పాత్ర నిడివి

ఇందులో రష్మిక శ్రీవల్లిగా కనిపించనున్నారు. పుష్పరాజ్‌ సతీమణిగా ఆమె రోల్‌ చాలా కీలకంగా ఉండనుంది. పార్ట్‌ 1తో పోలిస్తే ఇందులో తన రోల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆమె రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

అదరగొట్టనున్న ఫహద్

పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ పుష్ప-1లో కనిపించారు. పార్ట్‌-1లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. పార్ట్‌-2 ఫస్ట్‌ హాఫ్‌లో ఆయన నటన, పాత్ర అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జునే స్వయంగా చెప్పుకొచ్చారు.

కిస్సిక్​తో అలరించనున్న శ్రీలీల

కిస్సిక్‌ సాంగ్​లో అందాల హీరోయిన శ్రీలీల కనిపించారు. గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో బన్నీతో కలిసి శ్రీలీల స్టెప్టులేశారు. ఈ పాట కోసం ఆమె రూ.2 కోట్లు తీసుకున్నారని టాక్‌. పార్ట్‌-1లో స్పెషల్‌ సాంగ్‌ లో సమంత మెరిశారు.

పీలింగ్స్ స్పెషల్

పుష్ప-2లోని 'పీలింగ్స్‌' పాట ప్రత్యేకంగా ఉండనుంది. అన్ని భాషల్లోనూ ఈ పాట పల్లవి మలయాళంలో ఉంటుంది. మలయాళ అభిమానులపై ప్రేమతో ఈవిధంగా చేశామని అల్లు అర్జున్‌ ప్రకటించారు.

సేమ్ డైలాగ్ రైటర్

పార్ట్‌ 1కు డైలాగ్స్‌ అందించిన శ్రీకాంత్‌ విస్సా ఈ చిత్రానికీ వర్క్ చేశారు. 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్‌', 'పుష్ప అంటే ఫైర్‌ కాదు వైల్డ్‌ ఫైర్‌' అనే డైలాగ్స్‌ ఇప్పటికే సినీప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిడివి ఎక్కువే

'పుష్ప ది రూల్‌' నిడివి 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్లు. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సరిఫికెట్‌ ఇచ్చింది. అత్యధిక నిడివి గల తెలుగు చిత్రాల జాబితాలో ఈ మూవీ కూడా నిలిచింది.

'గంగోత్రి' టు 'పుష్ప'​ - రూ. 100 నుంచి రూ.300కోట్ల వరకూ​! - బన్నీ సినీ జర్నీ ఎలా సాగిందంటే?

ఆదిత్య 369 సీక్వెల్​ రిలీజ్ డేట్ - బాలయ్య ఆసక్తికర సమాధానమిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.