Street Style Onion Mixture Masala : రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే చిరుతిళ్లలో స్పైసీ ఉల్లి మిక్చర్ కూడా ఒకటి. ఈవెనింగ్ టైమ్లో పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు.. చాలా మందికి ఇదే గుర్తుకు వస్తుంటుంది. స్పైసీగా, కారంగా ఉండే ఉల్లి మిక్చర్ నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే.. రోడ్ సైడ్ బండి మీద తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది భయపడతారు. అలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే.. ఇంట్లోనే 5 నిమిషాల్లో స్పైసీ ఉల్లి మిక్చర్ రెడీ అయిపోతుంది. ఈ స్నాక్ రెసిపీ పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి, ఇక ఆలస్యం చేయకుండా సింపుల్గా ఇంట్లోనే ఉల్లి మిక్చర్ ఎలా చేయాలి ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ? అనేవి ఇప్పుడు చూద్దాం.
టేస్టీ ఉల్లి మిక్చర్కి కావాల్సిన పదార్థాలు :
- అటుకులు-కప్పు
- నూనె- సరిపడా
- ఉప్పు-రుచికి సరిపడా
- కారం- అర టీస్పూన్
- ఉల్లిపాయ-1
- కొత్తిమీర తరుగు కొద్దిగా
- నెయ్యి-అర స్పూన్
- పల్లీలు-పావుకప్పు
- పసుపు-చిటికెడు
- ధనియాలపొడి -అర స్పూన్
- చాట్ మసాలా- పావు టీస్పూన్
- నిమ్మకాయ-1
ఉల్లి మిక్చర్ తయారీ విధానం..
- ముందుగా ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి.
- తర్వాత అటుకులు వేయించడం కోసం స్టౌ పై పాన్ పెట్టండి.
- నూనె బాగా వేడయ్యాక.. అటుకులు వేసి వేయించుకోవాలి.
- (అటుకులు పల్చగా ఉండేవి కాకుండా కాస్త మందంగా ఉండేవి తీసుకోవాలి. అలాగే.. ఆయిల్ కాగకముందే అటుకులు వేసుకోవద్దు. అలా వేస్తే అటుకులు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడమే కాకుండా సరిగ్గా పొంగవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.)
- తర్వాత అటుకులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి.
- అదే ఆయిల్లో పల్లీలు వేయండి. వీటిని కూడా మాడిపోకుండా వేయించి మిక్సింగ్ బౌల్లో కలుపుకోండి.
- తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి, కొత్తిమీర తురుము, నెయ్యి వేసి కలపండి. ఆపై కొద్దిగా నిమ్మరసం పిండి చేతితో మిక్స్ చేయండి.
- అంతా బాగా కలుపుకున్నాక టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం, పులుపు వంటివి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
- అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే పుల్లపుల్లగా కారంగా ఎంతో రుచికరంగా ఉండే ఉల్లి మిక్చర్ సిద్ధమైపోతుంది.
- ఈ ఉల్లి మిక్చర్ మీకు నచ్చితే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి.
ఇవీ చదవండి :
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే "బ్రెడ్ రోల్స్" - ఈ స్టైల్లో చేస్తే ఒక్కటి కూడా విడిచి పెట్టరు!
చపాతీ, జొన్న రొట్టెల్లోకి అద్దిరిపోయే కాంబినేషన్ - మణిపురి స్పెషల్ "మంగళ్ ఊటీ" కర్రీ!