తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్ స్నాక్ రెసిపీ - క్రిస్పీ "సొరకాయ బజ్జీలు" - 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - SORAKAYA BAJJI RECIPE

-మిర్చి బజ్జీల కంటే అద్దిరిపోయే రెసిపీ -ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఫుల్ ఖుష్!

How to Make Sorakaya Bajji
Sorakaya Bajji Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 15, 2024, 3:35 PM IST

How to Make Sorakaya Bajji Recipe:సొరకాయ.. చాలా మంది దీన్ని అంతగా తినడానికి ఇష్టపడరు. కానీ, దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అలాంటి వారికోసమే ఒక అద్దిరిపోయే స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. సొరకాయ బజ్జీలు. ఇవి రుచిలో మిర్చీ బజ్జీలకు ఏమాత్రం తీసిపోవు! పైగా ఈ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వీటిని చిన్నపెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ఈ సొరకాయబజ్జీలను ట్రై చేసి ఆ టేస్ట్​ని ఆస్వాదించండి. ఇంతకీ, వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • సొరకాయ - 1(లేతగా ఉన్నది)
  • ఉప్పు - తగినంత
  • శనగపిండి - ముప్పావు కప్పు
  • బియ్యప్పిండి - పావు కప్పు కంటే కాస్త ఎక్కువ
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కారం - అర టీస్పూన్
  • పసుపు - పావు టీస్పూన్
  • ధనియాల పొడి - అర టీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • కరివేపాకు తరుగు - కొద్దిగా
  • వాము - అర టీస్పూన్
  • నూనె - వేయించడానికి సరిపడా

సొరకాయ దోశ ట్రై చేశారా?- బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా సొరకాయను తీసుకొని శుభ్రంగా కడిగి రెండు భాగాలు చేసుకోవాలి. అయితే, ఇక్కడ సగభాగం మాత్రమే తీసుకుంటున్నాం. అదే.. మీరు ఎక్కువ క్వాంటిటీలో బజ్జీలుకావాలనుకుంటే సొరకాయ మొత్తాన్ని తీసుకోవచ్చు. మిగతా ఇంగ్రీడియంట్స్​ని పెంచుకోవచ్చు.
  • ఇప్పుడు తీసుకున్న అరభాగం సొరకాయను పీలర్ సహాయంతో పైన పొట్టు తీసుకోవాలి. తర్వాత.. దాన్ని మరీ ఆలూ చిప్స్ అంత సన్నగా కాకుండా కొద్దిగా మందంగానే ఉండేలా రౌండ్​గా కట్ చేసుకోవాలి.
  • ఆపై వాటిని ఒక బౌల్​లో తీసుకుని కొద్దిగా ఉప్పు అందులో వేసి పక్కన ఉంచుకోవాలి. దీని వల్ల సొరకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు తరుగు, వాము.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచం జారుడుగా ఉండేలా పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. అంటే.. సొరకాయ ముక్కలకు పిండి కోట్ అయ్యేలా ఉంటే సరిపోతుంది.
  • అనంతరం స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. ఉప్పు నీళ్లలో వేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలను తీసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో రెండు వైపులా కోట్ చేసుకొని కాగుతున్న ఆయిల్​లో వేసుకోవాలి.
  • పాన్​లో ఫ్రీగా ఫ్రై చేసుకునేటట్లుగా సొరకాయ ముక్కలను వేసుకున్నాక.. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీ క్రిస్పీగా ఉండే "సొరకాయ బజ్జీలు" రెడీ!

పది నిమిషాల్లో పసందైన సొరకాయ పచ్చడి - పచ్చి మిర్చితో నెవ్వర్​ బిఫోర్ టేస్ట్!

ABOUT THE AUTHOR

...view details