ETV Bharat / offbeat

చుట్టాలొస్తే "కొబ్బరన్నం కోడికూర" ఇలా చేసి పెట్టండి - బిర్యానీని మించిన టేస్ట్! - KOBBARI ANNAM KODIKURA RECIPE

- వెరైటీ చికెన్​ రెసిపీతో అద్దిరిపోయే రుచి - ఒక్కసారి తిన్నారంటే "వన్స్ మోర్" అంటారు!

Kobbari Annam Kodikura Recipe in Telugu
Kobbari Annam Kodikura Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2025, 4:39 PM IST

Kobbari Annam Kodikura Recipe in Telugu : తెలంగాణలో మెజారిటీ పీపుల్ ఇంటికి బంధువులొచ్చినప్పుడు, పండగ సమయాల్లో ఎక్కువగా బగారా రైస్​ విత్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, అలాకాకుండా ఓసారి ఈ అద్దిరిపోయే కాంబినేషన్​ని ట్రై చేయండి. అదే, "కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం విత్ కోడికూర". ఈ స్టైల్​లో చేసి పెట్టారంటే, వారెవ్వా అంటారు. అంత రుచికరంగా ఉంటుంది ఈ కాంబినేషన్. మరి, ఈ రెసిపీ తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

మారినేషన్ కోసం :

  • కోడి మాంసం - 1 కిలో
  • ఉప్పు - కొద్దిగా
  • కారం - 2 టేబుల్​స్పూన్లు
  • పసుపు - పావుటీస్పూన్

మసాలా పేస్ట్ కోసం :

  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • సోంపు - 1 టీస్పూన్
  • గసగసాలు - 2 చెంచాలు
  • యాలకులు - 5
  • లవంగాలు - 6
  • అనాస పువ్వు - 1
  • దాల్చిన చెక్క - చిన్నముక్క
  • ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్​స్పూన్లు

కర్రీ కోసం :

  • నూనె - తగినంత
  • ఉల్లిపాయలు - 3
  • కరివేపాకు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 6
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • పసుపు - అరటీస్పూన్
  • వాటర్ - తగినన్ని

8 నిమిషాల్లోనే ఘుమఘుమలాడే "చికెన్​ బిర్యానీ" - నమ్మలేని నిజం - ఆ సీక్రెట్ ఇదే!

కొబ్బరన్నం కోసం :

  • బాస్మతి రైస్ - 3 గ్లాసులు
  • పచ్చికొబ్బరి ముక్కలు - 2 కప్పులు
  • ఆయిల్ - 3 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు - గుప్పెడు
  • కరివేపాకు - కొద్దిగా
  • లవంగాలు - 5
  • యాలకులు - 4
  • అనాస పువ్వు - 1
  • బిర్యానీ ఆకులు - 2
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • మిరియాలు - 10
  • పచ్చిమిర్చి - 5
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా

ఇంట్లోనే రెస్టారెంట్​ స్టైల్​ "చికెన్​ షేర్వా" - ఇలా చేస్తే ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే!

తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ని శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కారం, పసుపు వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి మూతపెట్టి అరగంట పాటు అలా వదిలేయాలి.
  • ఇప్పుడు మసాలా పేస్ట్​ కోసం ఒక గిన్నెలో ధనియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఎండుకొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆపై అరకప్పు వరకు వాటర్ పోసుకొని కొద్దిసేపు నాననివ్వాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​లో అరగంటపాటు నానబెట్టుకున్న మసాలా దినుసుల మిశ్రమం వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్​ని వేసి బాగా కలుపుతూ హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • అప్పుడు చికెన్ నుంచి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతుంది. అనంతరం మరో 5 నిమిషాల పాటు ఊరిన నీళ్లు ఆవిరయ్యే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత మంటను లో-ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ పావుగంట పాటు ఉడికించుకోవాలి.
  • చికెన్​లో నీళ్లు ఇగిరిపోయి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మసాలాల్లోని పచ్చిదనం పోయి చక్కగా వేగేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక ఈ స్టేజ్​లో మీకు కావాల్సిన పరిమాణంలో గ్రేవీ ఉండడానికి తగినన్ని వేడి నీరు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇదే స్టేజ్​లో ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కుక్కర్​ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ చికెన్ ఉడకలేదనిపిస్తే మరికొన్ని వేడినీరు వేసుకొని కలిపి మరో ఒకట్రెండు విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. అనంతరం ప్రెషర్ పోయాక మూతతీసి చూస్తే ఘుమఘుమలాడే "కోడికూర" రెడీ!

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా "చిల్లీ చికెన్" చేసుకోండి - ముక్క మిగల్చకుండా తినేస్తారంతే!

  • ఇప్పుడు కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ముందుగా బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీజార్ తీసుకొని పచ్చికొబ్బరి ముక్కలు అవి మునిగే వరకు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొబ్బరి పాల కోసం మిక్సీ పట్టుకున్న పేస్ట్​లో తగినన్ని వేడి నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెపై పల్చని క్లాత్ ఉంచి మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని గట్టిగా పిండుతూ కొబ్బరిపాలను వడకట్టుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై అన్నం వండుకోవడానికి అనుకూలంగా ఉండే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు పలుకులు వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక చివర్లో కరివేపాకు వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • ఆ తర్వాత అదే నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, మిరియాలు, సన్నని పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి.
  • ఆ తర్వాత బియ్యం తీసుకున్న గ్లాసుతో కొబ్బరిపాలను కొలిచి పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల కొబ్బరిపాలు పోసుకోవాలి. కొబ్బరిపాలు సరిపడా లేకపోతే మిగిలిన పరిమాణంలో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద కొబ్బరిపాల మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి.
  • ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి వేసుకొని కలిపి మూతపెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి.
  • ఆ తర్వాత మూతతీసి మరోసారి గరిటెతో చక్కగా కలిపి లో ఫ్లేమ్ మీద అన్నాన్ని పూర్తిగా ఉడించుకోవాలి.
  • అన్నం చక్కగా ఉడికాక కాసేపు అలా ఉంచి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "కొబ్బరన్నం" మీ ముందు ఉంటుంది.
  • ఆ తర్వాత ఈ కొబ్బరి అన్నాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోడికూరతో కలిపి వడ్డించారంటే సరి. తిన్నవారేవరైనా అద్భుతః అనాల్సిందే! మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఈ కాంబినేషన్ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఆస్వాదించండి.

రొటీన్ చికెన్​ కర్రీ వండుతున్నారా? - గ్రేవీ చికెన్ ఫ్రై, స్పెషల్ రైస్ - ఇలా ప్రిపేర్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.