Top 10 Non-veg Consuming States in India : పండగ ఏదైనా నాన్ వెజ్‌తో "పండగ చేసుకోవడం" మెజారిటీ తెలంగాణ వాసుల సంప్రదాయం. అందుకే మాంసం వినియోగం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే, దేశంలో అత్యధికంగా మాంసం తినే రాష్ట్రాలు ఏవో మీకు తెలుసా? ఈ విషయమై నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే (NHFS-5) వివరాలు సేకరించింది. మన దేశంలో నాన్ వెజ్ తినడంలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలేవో ప్రకటించింది. మరి, ఈ సర్వే ప్రకారం తెలంగాణ నంబర్ ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
నెంబర్ 1 : భారతదేశంలో అత్యధికంగా మాంసాహారం తినే రాష్ట్రం నాగాలాండ్. ఇక్కడ మెజారిటీ జనం మాంసాహారం తింటారు. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో ఏకంగా 99.8% ప్రజలు నాన్ వెజ్ తింటారట. ఇలా నాగాలాండ్ మాంసం వినియోగంలో టాప్1 ప్లేసులో నిలిచింది.
నెంబర్ 2 : మాంసాహారం తినే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ టాప్2గా నిలిచింది. ఇక్కడ కూడా అత్యధికంగా 99.3 శాతం జనం నాన్ వెజ్ టేస్ట్ చేస్తారట. ఇక్కడి జనం ఎక్కువగా చేపలను ఇష్టపడతారు.
నెంబర్ 3 : కేరళ టాప్3 ప్లేస్ ఆక్రమించింది. వీళ్లు కూడా సీఫుడ్స్ అధికంగా వినియోగిస్తారు. ఈ రాష్ట్రంలో కూడా నాన్ వెజ్ తినేవారి వాటా భారీగా ఉంది. 99.1 శాతం మంది కేరళీయులు మాంసాహారం ఆరగిస్తారట.
నెంబర్ 4 : నాలుగో స్థానాన్ని మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఇక్కడ చికెన్, మటన్ ఫుల్లుగా లాగించే వారు 98.25 శాతం మంది ఉన్నారు. తీర ప్రాంతాల్లో చేపలు కూడా దండిగా లాగిస్తారు.
నెంబర్ 5 : టాప్ 5లో తమిళనాడు నిలిచింది. ఈ రాష్ట్రంలో 97.65 శాతం మంది నాన్ వెజ్ తింటారు. చికెన్, మటన్, సీఫుడ్ ఇష్టంగా తినేస్తారు.
నెంబర్ 6 : ఒడిశా రాష్ట్రం ఆరో ప్లేసులో నిలిచింది. ఈ తీరప్రాంత రాష్ట్రంలో జనం ఎక్కువగా జలచరాలను తింటారు. ఇందులో రొయ్యలు అంటే వీరికి చాలా ఇష్టం. ఇక్కడ నాన్ వెజ్ తినేవారు 97.35 శాతంగా ఉన్నారు.
నెంబర్ 7 : తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది. ఇక్కడ మటన్, చికెన్, ఫిష్ తినేవాళ్ల సంఖ్య ఎక్కువ. జనాభాలో 97.4 శాతం మంది మాంసాహారం తింటారని NHFS తెలిపింది.
నెంబర్ 8 : ఎనిమిదో స్థానంలో జార్ఖండ్ నిలిచింది. ఈ రాష్ట్రంలోని జనాల్లో 97 శాతం మంది మాంసాహారం తింటారు. ఇక్కడి మెజారిటీ నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన వంటకం చికెన్.
నెంబర్ 9 : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 95 శాతం మంది నాన్ వెజ్ తింటారు. ఇక్కడ జనాలు ఎక్కువగా ఫిష్, పోర్క్, చికెన్ ఎక్కువగా తీసుకుంటారు.
నెంబర్ 10 : పదో స్థానంలో నిలిచిన రాష్ట్రం గోవా. ఇక్కడి జనాల్లో 93.8 శాతం మంది నాన్ వెజ్ తింటారు. మెజారిటీ ఆహార ప్రియులు చేపలు, పీతలు వంటి సీఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి :
సంక్రాంతి మటన్ ముక్క సరిగా ఉడకట్లేదా? - ఇలా చేస్తే మెత్తగా ఉడికిపోద్ది!
ఈ స్టైల్లో "మటన్ దమ్ బిర్యానీ" చేయండి - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారంతే!