How to Make Soft Chapati Easily at Home :చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాగే.. ఈ మధ్యకాలంలో కొందరు రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలనే తింటున్నారు. కానీ.. అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి చేసినా కొద్దిసేపటికే చపాతీలు గట్టిగా అవుతుంటాయని బాధపడుతుంటారు చాలా మంది. అలాంటి వారు ఈసారి చపాతీలను చేసుకునేటప్పుడు పిండిని కలపడం నుంచి కాల్చడం వరకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చపాతీలుపొంగడంతో పాటు.. గంటలపాటు కూడా సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయని, దూదిలా వస్తాయని అంటున్నారు కుకింగ్ ఎక్స్ పర్ట్స్. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- గోధుమ పిండి - 2 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - తగినంత
- వాటర్ - సరిపడా
చపాతీలలో ఈ పిండి కలిపితే అద్భుతం జరుగుతుంది - మీ ఒంట్లో కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది!
తయారీ విధానం :
- ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీలు సాఫ్ట్‌గా రావాలంటే పిండిని కలుపుకోవడంలోనే అసలైన సీక్రెట్ దాగి ఉంది. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా గోధుమపిండి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కేవలం చేతివేళ్లతో మాత్రమే కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తానికి నీళ్లు కలిపి.. ఆ తర్వాత అరచేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
- అయితే, పిండిని కలుపుకునేటప్పుడు ఏమైనా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. సరిపడా వాటర్ తీసుకున్నాక.. కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు పిండి ముద్దను సాగదీస్తూ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్‌గా వస్తుంది.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. అందులో రెండు టీస్పూన్ల ఆయిల్వేసుకొని మరోసారి నూనె పిండిలో చక్కగా కలిసి పోయేలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిపై మూత ఉంచి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- 10 నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి రెండు నిమిషాల పాటు చేతితో నెమ్మదిగా కలుపుకోవాలి. అనంతరం ఆ పిండిని మీరు చపాతీలు చేయాలనుకుంటున్న పరిమాణాన్ని బట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అవి ఆరిపోకుండా పైన మూత పెట్టుకోవాలి.
రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోయే చపాతీ కుర్మా - ఇలా ప్రిపేర్ చేయండి!
- ఇప్పుడు చపాతీ పీటపై ఒక ఉండను పొడిపిండిలో డిప్ చేసుకొని ముందుగా చపాతీ రోలర్ సహాయంతో పూరీ కంటే కాస్త ఎక్కువ పరిమాణంలో రోల్ చేసుకోవాలి.
- ఆ విధంగా రోల్ చేసుకున్నాక.. దానిపై ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఆపై మళ్లీ ఆ లేయర్‌పై కాస్త నూనె రాసి మరోసారి ఫోల్డ్ చేసుకోవాలి.
- నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేలా ట్రైయాంగిల్ షేప్‌లో మడత పెట్టాక.. ఆ చపాతీని మళ్లీ పొడిపిండిలో డిప్ చేసుకొని ముందుగా పిండి అంచులను స్ప్రెడ్ చేసుకుంటూ తర్వాత చపాతీలా రౌండ్ షేప్ వచ్చే వరకు రోల్ చేసుకోవాలి.
- ఇలా చేయడం ద్వారా చపాతీలు బాగా పొంగడమే కాదు.. సాఫ్ట్‌గా వస్తాయి. ఈవిధంగా చేసుకునేటప్పుడు పిండి అంటుకున్నట్లు అనిపిస్తే కాస్త పొడిపిండిని చల్లుకుంటూ చపాతీని రోల్ చేసుకోవాలి. అలాగే.. చపాతీని మరీ పల్చగా లేదా మందంగా కాకుండా మీడియం థిక్నెస్ వచ్చేలా తాల్చుకోవాలి.
- ఇలా చపాతీని చేసుకున్నాక వెంటనే కాల్చుకోవచ్చు. లేదంటే.. దాన్ని ప్లేట్లోకి తీసుకుని అది ఆరిపోకుండా ఏదైనా క్లాత్ కప్పి అన్ని ఉండలను ప్రిపేర్ చేసుకున్నాకైనా కాల్చుకోవచ్చు.
- ఇక ఇప్పుడు చపాతీలను కాల్చుకోవడానికి స్టౌపై పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడి అయ్యాక.. మీరు ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసి ముందుగా వన్‌సైడ్ 10 సెకన్ల పాటు కాలనివ్వాలి.
- ఆపై రెండో వైపు తిప్పి మరో 10 సెకన్ల పాటు కాల్చుకోవాలి. ఈ టైమ్‌లో చపాతీలు పొంగుతుంటాయి. అప్పుడు.. చపాతీ రెండు వైపులా నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు.
- ఈవిధంగా కాల్చుకున్న చపాతీలను హాట్ బాక్స్‌లో పెట్టి మూత పూర్తిగా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టాలి. ఇలా అన్నింటిని చేసుకుని తీసుకుంటే.. గంటలపాటూ "సూపర్సాఫ్ట్గా ఉండే చపాతీలు" రెడీ.
- అయితే, ఇక్కడ బరువుతగ్గేందుకు చపాతీ తినే వారు నూనె లేకుండా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకున్నా మెత్తగానే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి!
రక్తహీనత సమస్యా? - ఇలా బీట్ రూట్ చపాతీ చేసేయండి - అద్దిరిపోయే రుచి, అదనపు ఆరోగ్యం!