Smart Kitchen Gadgets :నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కోసారి చిన్న పనులు కూడా పెద్దవే అనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది వంటంతా ఒంటిచేత్తో ఈజీగా చేస్తుంటారు. కానీ, అదే ఏమైనా పగలకొట్టాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే, ఇకపై ఆ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పనిలేదు. ఎందుకంటే మార్కెట్లో అలాంటి పనులను తేలిక చేసేందుకు కొన్ని చిన్న చిన్న పరికరాలు లభిస్తున్నాయి. అవి మీ ఇంట్లో ఉంటే శ్రమలేకుండా ఆయా పదార్థాలను ఈజీగా పగలగొట్టొచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టూల్స్ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుడ్డు పగలగొట్టడం ఈజీ!
కొంతమంది కోడిగుడ్డు పగలగొట్టేటప్పుడు ఆ సొన కిచెన్ గట్టుపై వంపేస్తుంటారు. ఇక పిల్లలు ఆమ్లెట్ వంటివి తామంతట తామే వేసుకోవాలని ట్రై చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు గుడ్డుని పగలగొట్టడం రాక నేలపై పడేస్తుంటారు. అదే మీ కిచెన్లో "ఎగ్ క్రాకర్" ఉంటే ఆ భయం ఉండదు. ఎగ్ని దాంట్లో పెట్టి దానికున్న స్టీల్ బ్లేడ్‌లను నొక్కితే చాలు. ఈజీగా గుడ్డుపగిలిపోతుంది. పైగా సొన కాస్తకూడా చేతికి అంటకుండా, కిందపడకుండా సులువుగా వంట చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
కొబ్బరి తీయడం సులువే!
కొబ్బరితో ఏదైనా వంటకాలు చేసుకునేటప్పుడు టెంకాయ పగలగొట్టడం, పెంకు తీయడం కాస్త శ్రమతో కూడుకున్న పని. కానీ, అదే మీ వంటింట్లో "కోకోనట్ స్లైసర్" టూల్ ఉంటే ఆ పని ఈజీగా పూర్తయిపోతుంది. మందపాటి స్పూన్‌లా కనిపించే ఈ పరికరం ఇనుముతో తయారైనందున మన్నిక ఎక్కువే. దీంతో సులువుగా కొబ్బరికాయను పగలగొట్టి, కొబ్బరి తీయొచ్చు. అలాగే.. వేళ్లకి గాయమౌతుందో, గచ్చు పగులుతుందో అన్న బెంగ కూడా ఉండదట.