తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వెజిటేరియన్స్​ ఫేవరెట్​ "మష్రూమ్​ దమ్​ బిర్యానీ" - ఫిదా అయిపోతారు! - MUSHROOM DUM BIRYANI RECIPE

-పుట్టగొడుగులతో రుచికరమైన బిర్యానీ -ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా లాగిస్తారు

Mushroom Dum Biryani Recipe
Restaurant Style Mushroom Dum Biryani Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 10:43 AM IST

Restaurant Style Mushroom Dum Biryani Recipe : శాకాహారులకు మాంసకృత్తులు అందించే పదార్థాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. కానీ, చాలా మంది వీటితో ఏ వంటలు ట్రై చేయరు. కొంతమంది చేసినా ఎప్పుడూ మసాలా కర్రీ, ఫ్రై వంటి రెసిపీలు ట్రై చేస్తుంటారు. అయితే, ఎన్నో పోషకాలున్న మష్రూమ్స్​తో ఇప్పుడు దమ్​ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం.

ముందుగా దమ్​ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు :

  • బాస్మతి రైస్​-2 కప్పులు (గంటపాటు నానబెట్టుకోవాలి)
  • నీళ్లు -2 లీటర్లు
  • అనాసపువ్వులు-2
  • లవంగాలు-6
  • దాల్చినచెక్క-3
  • యాలకులు-6
  • మరాఠి మొగ్గ-2
  • బిర్యానీ ఆకులు-2
  • ఉప్పు రుచికి సరిపడా
  • షాజీరా- అరటీస్పూన్​
  • పచ్చిమిర్చి-3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-టీస్పూన్​
  • నూనె -టేబుల్​స్పూన్
  • నెయ్యి-టేబుల్​స్పూన్
  • కుంకుమ పువ్వు-చిటికెడు

దమ్​ బిర్యానీ తయారీ విధానం :

  • ముందుగా దమ్​ బిర్యానీ కోసం స్టౌపై గిన్నె పెట్టండి. నీళ్లు వేడయ్యాక అనాసపువ్వులు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మరాఠి మొగ్గ, బిర్యానీ ఆకులు వేయండి.
  • అలాగే రుచికి సరిపడా ఉప్పు, షాజీరా, పచ్చిమిర్చి వేసి కలపండి. నీళ్లు బాగా మరుగున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి మిక్స్​ చేయాలి.
  • తర్వాత నీటిలో బాస్మతి బియ్యం వేసుకోండి. రైస్​ 80 శాతం ఉడికించుకున్న తర్వాత.. జాలీ గరిటె సహాయంతో ఒక హండీలో స్ప్రెడ్ చేసుకోండి. నీటిలో నుంచి అన్నం పూర్తిగా హండీలోకి తీసుకోండి.
  • ఇప్పుడు హండీలో.. రైస్​ ఉడికించుకున్న నీటిని అరకప్పు చల్లుకోండి. అలాగే కుంకుమపువ్వు నానబెట్టిన నీటిని కూడా చల్లుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రైడ్​ ఆనియన్స్​ చల్లాలి. అలాగే కొద్దిగా నూనె, నెయ్యి కూడా రైస్​పై వేసుకోవాలి.
  • ఇప్పుడు హండీపై మూతపెట్టి దమ్​ కోసం స్టౌపై పెట్టాలి. రైస్​ని నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో, అలాగే నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్​లో దమ్​ చేసుకోవాలి. తర్వాత అరగంటపాటు అలా వదిలేయాలి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే మష్రూమ్​ బిర్యానీలోకి దమ్​ రైస్​ రెడీ అయిపోతుంది.

మరి ఇప్పుడు మష్రూమ్​ మసాలా ఎలా చేయాలో చూద్దాం..

మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు :

  • మష్రూమ్​-200 గ్రాములు
  • ఉల్లిపాయ-1
  • నూనె పావుకప్పు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • చక్కెర-టీస్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-టీస్పూన్​
  • ధనియాలపొడి-టీస్పూన్​
  • కారం-టేబుల్​స్పూన్​
  • పసుపు-పావుటీస్పూన్
  • జీలకర్రపొడి-అరటీస్పూన్​​
  • పెరుగు-పావుకప్పు
  • కొత్తిమీర,పుదీనా తరుగు-కొద్దిగా
  • ఫ్రైడ్​ ఆనియన్స్​ కొన్ని
  • కసూరీ మేథి-టేబుల్​స్పూన్
  • నిమ్మరసం-టేబుల్​స్పూన్​

గ్రేవీ కోసం..

  • జాపత్రీ-చిన్నది
  • అనాసపువ్వులు-2
  • రాతి పువ్వు-కొద్దిగా
  • యాలకులు-3
  • చిన్న దాల్చినచెక్క
  • లవంగాలు-4
  • జీడిపప్పులు-15
  • కర్బూజ గింజలు-టేబుల్​స్పూన్​
  • గసగసాలు- అర టేబుల్​స్పూన్​
  • టమాటాలు-3
  • నీళ్లు-కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా మష్రూమ్​లను శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్​ చేసుకోవాలి. అలాగే టమాటా, ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత దమ్​ బిర్యానీ కోసం ఉడికించుకున్న రైస్​ నీటిలో మష్రూమ్​ ముక్కలు వేయాలి. (మీరు మరొక గిన్నెలో మంచి నీటిని తీసుకొని కూడా మష్రూమ్ ఉడికించుకోవచ్చు.)
  • వీటిని 70 శాతం వరకు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో కొన్ని కూల్​ వాటర్​ పోయాలి.
  • తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి మసాలా దినుసులు, టమాటా ముక్కలు తీసుకోవాలి. ఇందులో వాటర్​ యాడ్​ చేసుకుంటూ మెత్తని పేస్ట్​లాగా సిద్ధం చేసుకోవాలి.
  • ఇప్పుడు మష్రూమ్ మసాలా చేయడం కోసం స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో నూనె పోసి వేడి చేయండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు ఫ్రై చేయండి.
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్​, ధనియాలపొడి, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్రపొడి వేసుకుని వేపుకోవాలి.
  • తర్వాత గ్రైండ్​ చేసుకున్న మసాలా పేస్ట్​ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్​ యాడ్​ చేసి నూనె పైకి తేలెంత వరకు ఉడికించుకోవాలి.
  • ఒక పది నిమిషాల తర్వాత ఉడికించుకున్న మష్రూమ్​ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై పెరుగు, కొత్తిమీర,పుదీనా తరుగు, కొన్ని ఫ్రైడ్​ ఆనియన్స్​ వేసి మిక్స్​ చేయాలి.
  • గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్​ చేసి మరో 5 నిమిషాలు కుక్ చేసుకోండి.
  • తర్వాత ఇందులో కసూరీ మేథి నలిపి వేసుకోండి. అలాగే పుదీనా తరుగు, పంచదార, నిమ్మరసం వేసి మిక్స్​ చేసి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే మష్రూమ్ మసాలా తయారైపోతుంది.
  • ఒక ప్లేట్లోకి దమ్​ బిర్యానీ రైస్​ వేసుకుని.. కొద్దిగా మష్రూమ్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన రెస్టారెంట్​ స్టైల్​ మష్రూమ్ దమ్​ బిర్యానీ మీ ముందుంటుంది.

ఇవి కూడా చదవండి :

శాఖాహారులకు అద్దిరిపోయే హైదరాబాదీ 'క్యాప్సికం దమ్ బిర్యానీ' - మస్తు మజాగా ఉంటుంది!

గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి

ABOUT THE AUTHOR

...view details