తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"ఇల్లు మీద భర్తతో సమానంగా భార్యకు హక్కు ఉంటుందా?" - నిపుణుల ఆన్సర్​ ఇదే! - PROPERTY RIGHTS IN TELUGU

- సమాన హక్కు పొందడానికి ఏం చేయాలో మీకు తెలుసా?

Property Rights for Married Couples
Property Rights for Married Couples (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 2:35 PM IST

Property Rights for Married Couples : ఈ ఆధునిక కాలంలో చాలా ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరూ కలిసి సంపాదించిన డబ్బుతో పిల్లల చదువులు, ఇతర ఖర్చులతో పాటు.. సొంత ఇంటి కలను నేరవేర్చుకుంటున్నారు. అయితే, భార్యాభర్తలిద్దరూ సంపాదించి.. కలిసి ఇల్లు కొన్నప్పుడు, ఆ ఇంటిపై ఎవరికి ఎంత హక్కు ఉంటుంది? అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. ఇలాంటి సందేహమే ఓ మహిళకు కలిగింది. ఇంతకీ ఆమె డౌట్​ ఏంటి? నిపుణులు ఎలాంటి సమాధానం చెప్పారు? అన్నది ఇప్పుడు చూద్దాం.

సందేహం..

"మేం ఇద్దరమూ జాబ్స్​ చేస్తున్నాం. ఇటీవల కొత్త ఇల్లు కొన్నాం. ఇంటిని మా ఆయన పేరుమీద రిజిస్టర్‌ చేశాం. తన శాలరీ నుంచి ఈఎంఐలు కడుతున్నారు. నా శాలరీని ఇంటి ఖర్చులూ, పిల్లల ట్యూషన్‌ ఫీజులూ, కారు లోన్‌.. వీటి కోసం ఉపయోగిస్తున్నాం. అయితే, ఇలా చేయడం మంచిదేనా? అసలు నాకు మా ఇంటిమీద భర్తతో సమాన హక్కు ఉంటుందా?" అని ఓ మహిళ అడుగుతున్నారు. దీనికి సర్టిఫైడ్​ ఫైనాన్సియల్​ ప్లానర్​ 'శిల్పా భాస్కర్​ గోలె' ఇలా సమాధానం ఇస్తున్నారు.

భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ, ఖర్చులకు డబ్బు కేటాయిస్తున్నపుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు ఖర్చు పెడుతున్న మొత్తం డబ్బు.. మీమీ సంపాదనల్లో నిష్పత్తుల్నిబట్టి నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మీ ఆయన వార్షికాదాయం రూ.24 లక్షలు, మీది రూ.12లక్షలు అనుకుంటే.. ఇద్దరూ ఆ నిష్పత్తి ప్రకారం ఎలా ఖర్చుచేయాలో ఒక అంచనాగా ఇప్పుడు చూద్దాం.

ఆదాయ వ్యయాలు భర్త భార్య
వార్షికాదాయం 24 లక్షలు 12 లక్షలు
ముఖ్యమైన ఖర్చులు 9 లక్షలు 4.5 లక్షలు
ఇతర ఖర్చులు 5 లక్షలు 2.5 లక్షలు
జీవిత, ఆరోగ్య బీమా 15వేలు 10 వేలు
రుణ ఈఎంఐ(ఇల్లు, కారు) 4.85 లక్షలు 2.4 లక్షలు
మిగులు(పొదుపు+మదుపు) 5 లక్షలు 2.5 లక్షలు

"కుటుంబాన్ని నడిపించడం కోసం జీవిత భాగస్వాములు ఇద్దరూ ఎంతో శ్రమిస్తారు. కాబట్టి, భార్యాభర్తలిద్దరూ సమానం. ఇక ఇంటికోసం మీరు చేసే ఖర్చులు కనిపిస్తాయి. కానీ.. కనిపించకుండా కుటుంబానికి మీ వంతుగా చాలా శ్రమిస్తారు. అయితే, ఇక్కడ ఎవరు ఎంత సంపాదిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా మీ పొదుపు, మదుపు, ఇతర ఆస్తులపై ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి."-శిల్పా భాస్కర్​ గోలె (సర్టిఫైడ్​ ఫైనాన్సియల్​ ప్లానర్)

సహ యజమానిగా రిజిస్ట్రేషన్‌ :

భర్త పేరు మీద ఇల్లు ఉంటే భార్యకు ఎలాంటి హక్కులు ఉండవు. మీకు చట్ట ప్రకారం.. హక్కులు ఉండాలంటే.. మీరూ సహ యజమానిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి. ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. మీరు సహ యజమాని అయితే ఇద్దరూ బ్యాంకు రుణాన్నీ పంచుకొని.. వీలునుబట్టి పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. కాబట్టి, సరైన నిర్ణయం తీసుకోండని శిల్పా భాస్కర్​ గోలె సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

'పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. అమ్మాయిలతో తిరుగుతున్నాడు' - ఏం చేయాలి?

ఆడపిల్లలకు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉండదా? - న్యాయ నిపుణుల సమాధానమిదే!

ABOUT THE AUTHOR

...view details