ETV Bharat / offbeat

ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ "అరిసెలు" చేసుకోండి - పర్ఫెక్ట్​ టేస్ట్​తో పొంగుతూ, సాఫ్ట్​గా వస్తాయి! - PERFECT ARISELU RECIPE

సంక్రాంతికి అరిసెలు చేయాలనుకుంటున్నారా? - ఇలా చేస్తే సూపర్ సాఫ్ట్​గా, పర్ఫెక్ట్​గా వస్తాయి!

HOW TO MAKE ARISELU
Ariselu Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 13 hours ago

Ariselu Recipe in Telugu : సంక్రాంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పిండి వంటకాల్లో అరిసెలు ముందు వరుసలో ఉంటాయి. అయితే, కొంతమంది అరిసెల పాకం ఎలా పట్టుకోవాలో తెలియక అరిసెలను ప్రిపేర్ చేసుకోరు. ఇంకొందరికి పాకం సరిగ్గా కుదరక అరిసెలు విరిగిపోవడం, గట్టిగా రావడం జరుగుతుంటుంది. అయితే, ఈసారి మేము చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పాకం ప్రిపేర్ చేసుకొని అరిసెలు తయారు చేసుకోండి. పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా సాఫ్ట్​గా, చాలా టేస్టీగా ఉంటాయి. మొదటిసారి చేసుకునేవారు కూడా ఈ ప్రాసెస్​లో సులువుగా అరిసెలు చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కేజీ
  • బెల్లం - ముప్పావు కేజీ
  • యాలకుల పొడి - 1 టీస్పూన్
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఆయిల్ - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం 24 గంటల పాటు నానబెట్టాలి. ఈ క్రమంలో మధ్యలో 4 నుంచి 6 సార్లు ఆ నీటిని పారబోసి మళ్లీ నీళ్లు పోస్తుండాలి. ఇలా చేయడం ద్వారా బియ్యం వాసన రాకుండా ఉంటాయి.(ఇందుకోసం రేషన్ బియ్యం లేదా నాన్​ పాలిష్​డ్ బియ్యం తీసుకోవడం బెటర్. అరిసెలు రుచికరంగా, మెత్తగా వస్తాయి)
  • ఆవిధంగా బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత వాటర్ వడకట్టుకోవాలి. ఆపై ఒక శుభ్రమైన పొడి క్లాత్​ మీద బియ్యాన్ని వేసి పల్చగా పరచి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. లైట్​గా చెమ్మ ఆరితే సరిపోతుంది. అంతేకానీ, ఫ్యాన్ కింద ఆరబెట్టడం, ఎండలో ఆరబెట్టడం లాంటివి చేయొద్దు.
  • ఆలోపు ఎర్రటి, మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకొని చక్కగా తురుముకొని పక్కనుంచాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో సగం వరకు ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని సన్నని హోల్స్ ఉండే జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి. ఆపై పిండిని చేతితో అదిమిపట్టి పక్కనుంచాలి. తర్వాత జల్లించుకోగ మిగిలిన బరకగా ఉన్న పిండి, మిగతా బియ్యాన్ని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదే ప్రాసెస్​లో బియ్యం మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి.
  • పిండి అనేది చాలా మెత్తగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా పిండిని రెడీ చేసుకున్నాక దానిపై ఒక క్లాత్​ని పరచి పక్కన పెట్టుకోవాలి.
  • ఒకవేళ మీరు బియ్యాన్ని గిర్నీలో పట్టించుకున్నా సరే జల్లించుకున్న తర్వాతనే వాడుకోవాలి. అలాగే, గిర్నీ నుంచి తీసుకొచ్చిన వెంటనే అరిసెలను ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే పిండి డ్రై అయిపోతుంది.

సంక్రాంతి స్పెషల్​ స్వీట్స్ : అద్దిరిపోయే "బూందీ లడ్డూ, బెల్లం గవ్వలు, గర్జలు" - సింపుల్​గా చేసుకోండిలా!

  • ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పెద్ద పాత్ర పెట్టుకొని అందులో తురిమి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని వేసి ముప్పావు కప్పు వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి
  • బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి. తర్వాత దాన్ని స్టౌపై పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మెత్తని ఉండ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి.
  • అయితే, పాకం వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి తరచుగా చెక్ చేస్తుండాలి. పర్ఫెక్ట్ పాకం వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే చిన్న బౌల్​లో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో గరిటెతో కాస్త పాకాన్ని వేస్తే సాఫ్ట్​ ఉండ పాకం రావాలి. అంటే ఆ ఉండను బయటకు తీసుకొని చేతితో నలుపుతుంటే ఈజీగా బెండ్ అయిపోయి చక్కగా రౌండ్​గా బాల్ షేప్ అనేది రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అరిసెలు సాఫ్ట్​గా వస్తాయి.
  • అదే పాకం కొంచం తక్కువైతే అరిసెలు విరిగిపోవడం, కొంచం ముదిరితే గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
  • ఆ విధంగా ఉండ పాకం వచ్చాక స్టౌను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని అందులో యాలకుల పొడి, నెయ్యి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత బెల్లం పాకం మిశ్రమంలో కొద్దికొద్దిగా బియ్యప్పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా పెద్ద గరిటెతో బాగా కలుపుకోవాలి. పిండిని సగం కలిపిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మిగతా పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
  • అయితే, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకుండా కాస్త లూజ్​గానే ఉండేలా చూసుకోవాలి.
  • ఆవిధంగా పిండిని మిక్స్ చేసుకున్నాక దానిపై నూనె/నెయ్యి వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కనుంచాలి.

పొంగల్ స్పెషల్ : క్రిస్పీ అండ్ టేస్టీ "రిబ్బన్ పకోడా, చెక్కలు, కొబ్బరి మురుకులు" - చేసుకోండిలా!

  • ఒకవేళ మీకు పిండి గట్టిగా అయిందనుకుంటే మరికొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఉండ పాకం చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదే పాకం ఎక్కువై పిండి తక్కువవుతుందనిపిస్తే ముందే పాకాన్ని ఒక చిన్న గ్లాసులో పక్కకు తీసుకుంటే సరిపోతుంది.
  • ఇప్పుడు చపాతీ పీటపై కట్ చేసిన ఆయిల్ కవర్ లేదా బటర్ పేపర్ వేసుకొని పైన కాస్త నూనె అప్లై చేసుకొని ముందుగా తయారు చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ మీడియం థిక్​నెస్​తో గుండ్రంగా వత్తుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక గుండ్రంగా వత్తుకున్న ఒక అరిసెను వేసుకోవాలి.
  • తర్వాత గరిటెతో బూరె మీదికి కొద్దిగా ఆయిల్ తోస్తుండాలి. అప్పుడు అది చక్కగా పొంగుతుంది. అలా పొంగిన తర్వాత మరో సైడ్​కి తిప్పుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుని తీసేయాలి.
  • ఇలా తీసిన అరిసెను రెండు గరిటెల మధ్యలో ఉంచి బాగా వత్తాలి. దీనివల్ల అరిసెలకు అదనంగా అంటుకున్న నూనె తొలగిపోతుంది. ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "అరిసెలు" రెడీ!
  • ఒకవేళ నువ్వుల అరిసెలు కావాలనుకుంటే వత్తుకునే ముందు నువ్వులలో డిప్ చేసుకొని వత్తుకొని కాల్చుకుంటే సరిపోతుంది.

సంక్రాంతి స్పెషల్ : సూపర్ టేస్టీ "కొబ్బరి బూరెలు" - అరిసెలు రానివారు ఈజీగా చేసేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.