ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులా? - ఈ వెబ్‌సైట్​లో ఫిర్యాదు చేసేయండి - INDIRAMMA HOUSES GRIEVANCE WEBSITE

ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ - వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి - ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలపై మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం

Indiramma Houses Grievance Website
Indiramma Houses Grievance Website (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Indiramma Houses Grievance Website : ఇందిర‌మ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలుచేసే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక‌లో సమస్యలు తలెత్తితే వెంటనే indirammaindlu.telangana.gov.in వెబ్​సైట్​లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

మొబైల్‌కు ఎస్​ఎంఎస్​ : ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలను మొబైల్‌కు ఎస్​ఎంఎస్​ ద్వారా సమాచారం వస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ద్వారా సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు వెళ్తుందని వివరించారు. ఇందిర‌మ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులకే దక్కేలా పార‌దర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

95శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి : వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన జిల్లాల్లో 95శాతం, జీహెచ్​ఎంసీలో 88శాతం పూర్తైనట్లు వెల్లడించారు. త్వరలో ల‌బ్దిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణానికి అవసరమైన కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారించాల‌ని అధికారులకు తెలిపారు.

కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు : తొలివిడ‌త‌లో స్థలం ఉన్న వారికి ఇంటినిర్మాణం, రెండోదశలో నివాస స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి ల‌బ్దిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవ‌కాశం కల్పించినట్లు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారికి రూ.5లక్షల ఆర్థిక సాయం, స్థలం లేనివారి కోసం 4,50,000 ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించింది. సొంత స్థలం ఉన్నవారికే మొదట ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించినందున ఇంటింటి సర్వేలో వారు ఉంటున్న ఇల్లు సొంతమా?, కిరాయిదా? అనే వివరాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్​లో సుమారు 90 శాతం మంది స్థలం లేదని తెలుపుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల యాప్​ సర్వేలో అక్రమాలు! - తిరిగి దరఖాస్తుల పరిశీలన - ఫైనల్ లిస్ట్ ఎప్పుడంటే?

సర్వే ముగిసింది - ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? - అయోమయంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.