ETV Bharat / offbeat

అన్నం, టిఫెన్స్​లోకి అద్దిరిపోయే "పులిహోర పొడి" - ఇలా చేసుకున్నారంటే 6 నెలల పాటు నిల్వ! - PULIHORA PODI RECIPE

ఈ పొడి ఉంటే నిమిషాల్లో కమ్మని పులిహోర రెడీ - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

INSTANT PULIHORA RECIPE
Pulihora Podi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

Pulihora Podi Recipe in Telugu : పండగొచ్చినా, పబ్బమొచ్చినా, చుట్టాలొచ్చినా ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకునే రెసిపీలలో ముందు వరుసలో ఉంటుంది పులిహోర. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని చాలా ఇష్టంగానూ తింటారు. అయితే, అదే పులిహోరను ఇన్​స్టంట్​గా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఖాళీ టైమ్ ఉన్నప్పుడు ఇలా "పులిహోర పొడిని" తయారు చేసుకొని పెట్టుకుంటే చాలు. ఈ పొడిని కేవలం పులిహోరగానే కాకుండా బ్రేక్​ఫాస్ట్​ లేదా లంచ్​లోకి సైడ్​ డిష్​గానూ వేసుకొని తినొచ్చు. మరి, ఎంతో టేస్టీగా, పుల్ల పుల్లగా, కారంకారంగా ఉండే కమ్మని పులిహోర పొడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కశ్మీరీ ఎండుమిర్చి - 25 నుంచి 30
  • కారం గల నార్మల్ ఎండుమిర్చి - 6
  • శనగపప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • మినప్పప్పు - 1 టేబుల్​స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్​స్పూన్
  • మిరియాలు - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మెంతులు - పావుటీస్పూన్
  • నువ్వులు - 1 టేబుల్​స్పూన్
  • నూనె - 2 టీస్పూన్లు
  • కరివేపాకు - పిడికెడు
  • చింతపండు - 50 గ్రాములు
  • పసుపు - పావుటీస్పూన్
  • బెల్లం - పావుటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపుకోసం :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • పల్లీలు - ముప్పావు కప్పు
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • ఎండుమిర్చి - 5
  • కరివేపాకు - కొద్దిగా
  • ఇంగువ - చిటికెడు
  • కొబ్బరి తురుము - 1 టేబుల్​స్పూన్

నోరూరించే "రవ్వ పులిహోర" - కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని కశ్మీరీ రెడ్ చిల్లీ, కారం గల ఎండుమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఈ మిర్చి అందుబాటులో లేకపోతే కారం గల నార్మల్ ఎండుమిర్చిని ఒక 20 నుంచి 22 వరకు తీసుకున్నా సరిపోతుంది.
  • తర్వాత అదే పాన్​లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మరో 2 నిమిషాలు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఎండుమిర్చి ఉన్న ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై మళ్లీ అదే పాన్​ పెట్టుకొని మెంతులను వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగాక నువ్వులను వేసి చిటపటమనే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసుకోవాలి. ఆపై అందులో తాజా కరివేపాకుని వేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని పాన్ వేడిగా ఉండగానే అందులో నారలు, గింజలు తీసుకున్న చింతపండుని వేసుకుని కాసేపు అలా వదిలేస్తే చింతపండు కూడా చక్కగా ఫ్రై అవుతుంది.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అలాగే పసుపు, బెల్లం, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అయితే, ఈ పొడిని బ్రేక్​ఫాస్ట్​లోకి ప్రిపేర్ చేసుకుంటే గ్రైండ్ చేసుకున్నాక చల్లార్చుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం 5 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది!

ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ "అరిసెలు" చేసుకోండి - పర్ఫెక్ట్​ టేస్ట్​తో పొంగుతూ, సాఫ్ట్​గా వస్తాయి!

  • అదే పులిహోర పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అవి వేగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాయనుకున్నాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేపుకోవాలి. ఇక చివర్లో కొబ్బరి తురుమూ వేసుకొని చక్కగా వేయించుకోవాలి.
  • తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని అందులో మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పొడిని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "ఇన్​స్టంట్ పులిహోర పొడి" రెడీ!
  • ఇలా చేసుకున్న పొడి పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజులు వాడుకోవచ్చు!
  • దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక పాన్​లో రెండు టీస్పూన్ల నూనె, రెండు టేబుల్​స్పూన్ల పులిహోర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆపై అందులో ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే కమ్మని పులిహోర నిమిషాల్లో రెడీ అయిపోతుంది.

గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్​ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.