ETV Bharat / state

విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా? - అధికారులపై చంద్రబాబు మండిపాటు - TIRUPATI STAMPEDE INCIDENT

తిరుపతిలో జరిగిన తోపులాట ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష - ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం - భక్తులు భారీగా వస్తారని తెలిసీ, ఎందుకు ఏర్పాట్లు చేయలేదని మండిపాటు

AP CM Chandrababu Naidu On Tirupati Stampede Incident
AP CM Chandrababu Naidu On Tirupati Stampede Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

AP CM Chandrababu Naidu On Tirupati Stampede Incident : ఏపీలోని తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ, అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని అధికారులను నిలదీశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో బుధవారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముందు జాగ్రత్త చర్యల్లో విఫలం అయిన అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునః సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న టైంలోనే ఇలాంటి విచారకర ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని అన్నారు.

చంద్రబాబు తిరుపతి పర్యటన : క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు నేడు చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన తిరుపతి జిల్లా ఉన్నత అధికారులు, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి - కఠిన చర్యలు తీసుకోవాలి : తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Massive Stampede at Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలి రావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు భక్తుల మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.