తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈ మంచు వేళల్లో పాపికొండలు టూర్ - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - PAPIKONDALU TOUR

- సంక్రాంతి సంబరాల వేళ పాపి కొండలు టూర్ - గోదారి అలలపై పండగను ఎంజాయ్ చేయండి

Papikondalu Tour
Papikondalu Tour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2025, 5:28 PM IST

Papikondalu Tour : గోదారి అలలపై లాంచీలో ప్రయాణిస్తూ, పాపికొండల అందాలను వీక్షిస్తూ, ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం ఒక గొప్ప అనుభూతి. ఈ ఫీలింగ్స్​ను టూరిస్టులకు అందించేందుకు తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ ప్రకటించింది. మొత్తం మూడు రోజులపాటు సాగే ఈ టూర్​ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోండిలా..

  • "పాపికొండలు రోడ్ కమ్ రివర్ క్రూయిజ్ ప్యాకేజీ టూర్" పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ఆపరేట్ చేస్తోంది.
  • మొత్తం మూడు రోజులపాటు ఈ టూర్ కొనసాగుతుంది.

మొదటి రోజు :

  • మొదటి రోజు సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్​ ఐఆర్ఓ-పర్యాటక్ భవన్ నుండి బస్సు బయలుదేరుతుంది.
  • రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ చేరుకుటుంది.
  • నాన్-ఏసీ బస్సులో ఈ ప్రయాణం సాగుతుంది.
  • రాత్రి మొత్తం ప్రయాణం సాగుతుంది. ఉదయం భద్రాచలం వరకు ఈ జర్నీ కొనసాగుతుంది. ఈ ప్రయాణ మార్గంలో భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

2వ రోజు :

  • ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 8:00 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు వెళ్తారు.
  • అక్కడి నుంచి లాంచీలో గోదావరిపైన పాపికొండలు టూర్ మొదలవుతుంది.
  • పేరంటాలపల్లి, కొల్లూరు, కోర్టూరు ప్రాంతాల మీదుగా యాత్ర కొనసాగుతుంది.
  • ఈ క్రమంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ బోట్​లోనే వడ్డిస్తారు.
  • సాయంత్రానికి తిరిగి భద్రాచలం చేరుకుంటారు. అక్కడి హరిత హోటల్​లో రాత్రి బస చేస్తారు (డబుల్ ఆక్యుపెన్సీ).

3వ రోజు:

  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. రామాలయాన్ని సందర్శిస్తారు. (బ్రేక్​ ఫాస్ట్​ ప్యాకేజీలో కవర్ కాదు.)
  • ఆ తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. తిరిగి భద్రాచలం హరిత హోటల్​కు చేరుకుంటారు.
  • మధ్యాహ్న భోజనం తర్వాత భద్రాచలం నుండి హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఛార్జీ వివరాలు :

  • ఈ టూర్​లో పెద్దలకు రూ.6,999 ఛార్జీగా నిర్ణయించారు.
  • పిల్లలకు రూ.5,599గా నిర్ణయించారు.
  • ఈ టూర్‌లో రోడ్డు మార్గంలోకానీ, బోటింగ్​లో కానీ ఎయిర్​ కండిషనర్లు ఉండవు.
  • ప్రస్తుతం ఈ టూర్ జనవరి 17వ తేదీన ప్రారంభం కానుంది.
  • మరిన్ని వివరాలకోసం, టికెట్ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైఫ్​ జాకెట్లు కంపల్సరీ..

గోదావరి నదిపై లాంచీలో ప్రయాణం చేస్తున్నప్పుడు టూరిస్టులు అందరూ తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలి. అయితే, చాలా మంది అసౌకర్యంగా ఉన్నాయనే కారణంతో వాటిని పక్కన పడేస్తుంటారు. కానీ, ఏదైనా ఊహించని ప్రమాదం జరిగినప్పుడు రక్షణ కోసం తప్పకుండా లైఫ్​ జాకెట్లు ధరించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం సాగిస్తే పాపికొండలు టూర్​ అత్యద్భుతంగా సాగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ABOUT THE AUTHOR

...view details