Butter Naan and Paneer Butter Masala Recipe :బటర్ నాన్ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అందులోకి పనీర్ బటర్ మసాలా సూపర్ కాంబినేషన్. ఈ క్రమంలోనే ఎక్కవ మంది రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లినప్పుడు ఈ ఫుడ్ కాంబినేషన్‌ను ఆర్డర్ చేస్తుంటారు. అయితే, అదే.. ఇంట్లో చేసుకోవాలంటే బటర్ నాన్ని కాల్చడానికి తందూర్ కావాలి. అదంతా చాలా ప్రాసెస్‌తో కూడుకున్నదనుకుంటారు. అలాగే పనీర్ బటర్ మసాలా కర్రీ అంతా టేస్టీగా రాదని ఫీల్ అవుతుంటారు. కానీ, మీకు తెలుసా? ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే దోశ పెనంపై ఈజీగా బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలాను చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
బటర్ నాన్ కోసం :
- మైదా - 2 కప్పులు
- బేకింగ్ పౌడర్ - ముప్పావుటీస్పూన్
- వంట సోడా - అరటీస్పూన్
- చక్కెర - 1 టీస్పూన్
- ఉప్పు - చిటికెడు
- పాలు - పావు కప్పు
- పెరుగు - పావు కప్పు
- బటర్ - తగినంత
- నూనె - కొద్దిగా
పనీర్ బటర్ మసాలా కర్రీ కోసం :
- బటర్ - 2 టేబుల్‌స్పూన్లు
- బిర్యానీ ఆకు - 1
- దాల్చిన చెక్క - అంగుళం ముక్క
- లవంగాలు - 5
- యాలకులు - 2
- ఎండుమిర్చి - 1
- వెల్లుల్లి రెబ్బలు - 10
- అల్లం - అంగుళం ముక్క
- ఉల్లిపాయ - 1
- జీడిపప్పు పలుకులు - 10
- టమాటా - 4(మీడియం సైజ్‌వి)
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- షాజీరా - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - తగినంత
- జీలకర్ర పొడి - పావుటీస్పూన్
- ధనియాల పొడి - అరటీస్పూన్
- పసుపు - చిటికెడు
- పనీర్ ముక్కలు - 100 గ్రాములు
- గరంమసాలా - అరటీస్పూన్
- కసూరి మేతి - 1 చెంచా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఇంట్లోనే దాబా స్టైల్ "పనీర్ దోప్యాజా" కర్రీ - ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరంతే!
తయారీ విధానం :
- ముందుగా బటర్ నాన్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పంచదార, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పాలు, పెరుగు యాడ్ చేసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి చక్కగా కలవకపోతే మరీ కొద్దిగా పాలు, పెరుగు వేసుకొని చపాతీ ముద్ద కంటే కాస్త లూజ్‌గా ఉండేటట్లు కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడే 1 టేబుల్‌స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. అంతేకానీ.. నీళ్లు యాడ్ చేసుకోవద్దు.
- ఇలా పాలు, పెరుగు వేసి పిండిని కలుపుకోవడం వల్ల బటర్ నాన్ చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది. అలాగే పిండి మిక్స్ చేసుకునేటప్పుడు చేతులకు బాగా అంటుతున్నట్లనిపిస్తే కొద్దిగా మైదాను యాడ్ చేసుకోవచ్చు.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక దానిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బౌల్ మీద మూత పెట్టేసి రెండు గంటల పాటు అలా వదిలేయాలి.
- ఈలోపు పనీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని దోరగా వేయించుకోవాలి.
- అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరుకున్న అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, జీడిపప్పు పలుకులు వేసుకొని ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసుకొని అవి మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.
వెజ్ లవర్స్ కోసం అద్దిరిపోయే "పనీర్ మొఘలాయ్ దమ్ బిర్యానీ" - ఇలా ట్రై చేయండి!
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన టమాటా మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పేస్ట్‌లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక షాజీరా వేసి కాస్త వేయించుకున్నాక.. మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి లో ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ మిశ్రమంలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక.. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ పోసుకొని మరోసారి బాగా కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- తర్వాత పనీర్ ముక్కలు, గరంమసాలా, కసూరి మేతిని నలిపి వేసుకొని బాగా కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్నాక చివర్లో కొద్దిగా బటర్, కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. సూపర్ టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా కర్రీ రెడీ!
- ఇక ఇప్పుడు రెండు గంటలపాటు పక్కన కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవాలి.
- అందుకోసం చపాతీపీటపై కొద్దిగా పొడి పిండిని వేసుకొని దానిపై పిండి ముద్దను ఉంచి ఆరు భాగాలుగా కట్ చేసి ఉండలుగా చేసుకోవాలి.
- తర్వాత మరీ కొద్దిగా పొడి పిండిని వేసుకొని పిండి ఉండను చపాతీ రోలర్‌తో మరీ పల్చగా, మందంగా కాకుండా ఓవల్ షేప్‌లో రుద్దుకోవాలి.
- ఆవిధంగా రుద్దుకున్నాక ఒకవైపు కొద్దిగా వాటర్‌ను చేతితో అప్లై చేసుకొని ఆ సైడ్ దోశ పెనానికి అంటుకునేటట్లు వేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఆ పెనాన్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. కొద్దిసేపటికి నాన్పై లైట్‌గా బబుల్స్ వస్తాయి. అప్పుడు మరోవైపునకు టర్న్ చేసుకొని పాన్‌పై కాల్చుకోవచ్చు. లేదంటే నాన్ని డైరెక్ట్‌గా స్టౌపై ఉంచి అయినా కాల్చుకోవచ్చు.
- ఆవిధంగా అన్నింటిని చేసుకున్నాక వాటిపై కొద్దిగా బటర్ అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనీర్ బటర్ మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బటర్ నాన్ విత్ పనీర్ బటర్ మసాలా" రెడీ!
కమ్మని స్వీట్ షాప్ స్టైల్ "పనీర్ జిలేబీ" - సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండిలా! - తింటే ఆహా అనాల్సిందే!