తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పిండి, నెయ్యి అక్కర్లేదు - కేవలం పాలు, చక్కెరతో బ్రహ్మాండమైన "మిల్క్ గులాబ్ జామూన్" రెడీ! - Oil Free Milk Gulab jamun Recipe

Milk Gulab jamun : గులాబ్​ జామున్​ పేరు చెబితేచాలు.. స్వీట్​ లవర్స్ మౌత్ వాటర్​తో నిండిపోతుంది. అయితే.. వీటిని తయారు చేయాలంటే నూనె లేదా నెయ్యి అవసరం. కానీ.. ఇవేమీ లేకుండా కేవలం పాలు, పంచదారతోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Milk Gulab jamun
Milk Gulab jamun (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 19, 2024, 4:36 PM IST

Oil Free Milk Gulab jamun Recipe: గులాబ్ జామూన్‌ను చూస్తే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఇక దాన్ని ఒక బౌల్‌లో తీసుకొని.. కొంచెం ఐస్‌క్రీం టచ్‌ ఇచ్చి తింటే సూపర్ యమ్మీ యమ్మీగా ఉంటుంది. అయితే.. గులాబ్​ జామున్​ చేయాలంటే పిండి, నూనె లేదా నెయ్యి యూజ్​ చేయాలి. కానీ.. అవేమి లేకుండా కేవలం పాలు, పంచదారతో ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్​ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • పాలు - 1 లీటర్​
  • పంచదార - 1 కప్పు(సుమారు 200 గ్రాములు)
  • నీరు - సరిపడా
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • నిమ్మరసం - 2 టేబుల్​ స్పూన్లు
  • మైదా పిండి - 1 టేబుల్​ స్పూన్​
  • బొంబాయి రవ్వ - 1 టేబుల్​ స్పూన్​
  • బేకింగ్​ పౌడర్​ - పావు టీ స్పూన్​

ఇది రాజస్థాన్‌ వాళ్ల పాయసం- మన స్టైల్లో వండితే అమృతమే!

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పాలు పోసి వేడి చేసుకోవాలి.
  • పాలు ఓ పొంగు వచ్చిన తర్వాత మీగడను కలుపుకుంటూ ఓ 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్​ ఆఫ్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ చిన్న గిన్నెలో నిమ్మరసం తీసుకుని అందులోకి రెండు టేబుల్​ స్పూన్ల నీరు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని గోరువెచ్చని పాలల్లో కలుపుకుంటే.. విరిగిపోతాయి.
  • ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులో స్టెయినర్ పెట్టి దాని మీద కాటన్​ క్లాత్​ పరిచి పాలు అందులో పోసుకోవాలి. పాలలో వాటర్​ అంతా పోయిన తర్వాత మరికొన్ని నీళ్లు పోసుకుని కడిగి.. నీరు లేకుండా ఆ క్లాత్​ను గట్టిగా పిండి ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ ప్లేట్​లోకి తీసుకుని పొడిపొడిగా చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి మైదా పిండి, బొంబాయి రవ్వ, బేకింగ్​ పౌడర్​ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అరచేతితో ప్రెస్​ చేస్తూ సాఫ్ట్​గా చేసుకోవాలి.
  • ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్​లో ఒత్తుకోవాలి.
  • అంటే గులాబ్​జామున్​ షేప్​ లేదా కాలాజామున్​ షేప్​ లేదా బుల్లెట్​.. ఇలా మీకు నచ్చిన విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి.

స్వీట్​ షాప్​ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్​తో తయారు చేస్తే అమోఘమైన రుచి!

  • ఇప్పుడు స్టవ్​ మీద పాన్​ పెట్టి 200 గ్రాముల చక్కెరలో మూడు టేబుల్​ స్పూన్ల పంచదారను పాన్​లో వేసి 2 టీ స్పూన్ల నీరు పోసి కేరమిల్​ ప్రిపేర్​ చేసుకోవాలి.
  • అంటే మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి​ పంచదార కరిగి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి 1 కప్పు నీరు(పంచదారను ఏ కొలత ప్రకారం తీసుకుంటే ఆ కొలత ప్రకారం నీరు తీసుకోవాలి) పోసుకోవాలి.
  • అనంతరం మిగిలిన చక్కెర వేసి మరో రెండు కప్పుల నీరు పోసి బాగా మరిగించుకోవాలి.
  • పంచదార నీరు మరుగుతున్నప్పుడు ముందుగా చేసుకున్న బాల్స్​ వేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆ తర్వాత మూతను పూర్తిగా క్లోజ్​ చేయకుండా కొద్దిగా ఓపెన్​ చేసి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు వాటిని నెమ్మదిగా ఒక్కొక్కటి కలుపుకుంటూ.. ఈసారి మూతను పూర్తిగా పెట్టి లో ఫ్లేమ్​ మీద 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత ఆ బాల్స్​ గోల్డెన్​ కలర్​ అంటే గులాబ్​జామున్​ వేయించుకుంటే ఎలా వస్తాయో అలా వస్తాయి.
  • ఆ సమయంలో 1 టీ స్పూన్​ యాలకుల పొడి వేసుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వెడల్పు పాత్రలో వేసుకుని చల్లార్చుకోవాలి.
  • అంతే గులాబ్​జామున్​ కన్నా టేస్టీగా ఉండే మిల్క్​ గులాబ్​జామున్​ రెడీ!

ఇంట్లోనే ఈజీగా "మీఠా సమోసా" - టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఛాయ్​ చేసినంత సులువుగా అద్దిరిపోయే "పనీర్ ఖీర్" - ఇలా ప్రిపేర్ చేసుకోండి

ABOUT THE AUTHOR

...view details