తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

హైదరాబాద్​ స్పెషల్​ "మటన్​ మలై హండి" - బగారా రైస్​లోకి సూపర్ కాంబో! - MUTTON MALAI HANDI

- మటన్​తో కొత్త రెసిపీలు చేసే వారికి సూపర్​ ఆప్షన్​ - ఇలా ప్రిపేర్ చేసుకోండి

Mutton Malai Handi Recipe
Mutton Malai Handi Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 11:08 AM IST

Mutton Malai Handi Recipe :హైదరాబాద్​ బిర్యానీ ఎంత ఫేమసో​ మనందరికీ తెలిసిందే. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఘుమఘుమలాడే దమ్ బిర్యానీ ఆరగించే వెళ్తారు. అయితే, బిర్యానీతో పాటు.. "మటన్​ మలై హండి" కూడా అంతే ఫేమస్. ఈ రెసిపీ స్పైసీగా, ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సారి.. మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. బగారా రైస్​, చపాతీల్లోకి అద్దిరిపోతుంది. మరి మటన్ మలై ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • మటన్ - అరకేజీ
  • లవంగాలు-5
  • దాల్చినచెక్క-1
  • యాలకులు-3
  • మిరియాలు-7
  • గరం మసాలా-అరటీస్పూన్
  • ధనియాల పొడి-టీస్పూన్​
  • ఉప్పు -రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు- కొద్దిగా
  • పుదీనా తరుగు- కొద్దిగా
  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-4
  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-టేబుల్​స్పూన్
  • పెరుగు -కప్పు
  • జీడిపప్పులు-15 (నీటిలో నానబెట్టుకోవాలి)
  • వైట్​ చిల్లీ పౌడర్​-టీస్పూన్
  • జీలకర్రపొడి-అరటీస్పూన్
  • మిరియాలపొడి-అరటీస్పూన్
  • కసూరీ మేథి-టీస్పూన్
  • డైరీ క్రీమ్​-4 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా మటన్​ శుభ్రంగా నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకోవాలి.
  • ఆపై ఇప్పుడు మటన్​ ఉడికించుకోవడం కోసం స్టౌపై కుక్కర్​ పెట్టండి.
  • ఇందులో ఆయిల్​ పోసి వేడి చేయండి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి కాసేపు వేపండి.
  • ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్​ కలర్లో మారిన తర్వాత శుభ్రంగా కడిగిన మటన్​ వేసి కొద్దిసేపు ఫ్రై వేయించండి.
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి ఫ్రై చేయండి. ఒక రెండు నిమిషాల తర్వాత ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మూడు గ్లాసుల నీటిని పోసుకుని కలపండి.
  • ఆపై 15 నిమిషాలు మటన్​ ఉడికించుకోండి.
  • మటన్​ ఉడికే సమయంలో ఒక కప్పు పెరుగు గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టిన జీడిపప్పులు, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. తర్వాత పెరుగు గిన్నెలోకి జీడిపప్పు పేస్ట్​, కచ్చాపచ్చాగా చేసిన రెండు పచ్చిమిర్చిలను వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • మటన్​ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఈ మిశ్రమాన్ని స్టౌపై మరో పాన్​ పెట్టి అందులో వేసుకోండి. తర్వాత పెరుగు - జీడిపప్పు మిశ్రమం వేసి కలపండి.
  • అలాగే వైట్​ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్రపొడి, మిరియాలపొడి, కసూరీ మేథి వేసి మిక్స్ చేయండి.
  • ఇప్పుడు ఒక్కసారి రుచి చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి.
  • తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత గరం మసాలా వేసి కలపండి.
  • అలాగే డైరీ క్రీమ్ వేసుకుని మిక్స్​ చేయండి. మటన్​ మలైలో ఆయిల్​ పూర్తిగా పైకి తేలిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ మలై మీ ముందుంటుంది.

ABOUT THE AUTHOR

...view details